Natasimham Balakrishna to Launch Satyabhama Trailer

 ఈ నెల 24న నటసింహం బాలకృష్ణ చేతుల మీదుగా 'క్వీన్ ఆఫ్ మాసెస్' కాజల్ అగర్వాల్ "సత్యభామ" సినిమా ట్రైలర్ రిలీజ్



'క్వీన్ ఆఫ్ మాసెస్' కాజల్ అగర్వాల్ లీడ్ రోల్ లో నటిస్తున్న సినిమా “సత్యభామ”. నవీన్ చంద్ర అమరేందర్ అనే కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు. “మేజర్” చిత్ర దర్శకుడు శశికిరణ్ తిక్క సమర్పకులుగా వ్యవహరిస్తూ స్క్రీన్ ప్లే అందించారు. క్రైమ్ థ్రిల్లర్ కథతో దర్శకుడు సుమన్ చిక్కాల రూపొందించారు.

“సత్యభామ” సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ అనౌన్స్ మెంట్ చేశారు మేకర్స్. ఈ నెల 24న హైదరాబాద్ లో నటసింహం బాలకృష్ణ చేతుల మీదుగా “సత్యభామ” సినిమా ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నట్లు దర్శక నిర్మాతలు ప్రకటించారు. బాలకృష్ణ అతిథిగా వస్తుండటంతో “సత్యభామ” మూవీకి మరింత క్రేజ్ ఏర్పడటం ఖాయమని చెప్పుకోవచ్చు.

నటీనటులు - కాజల్ అగర్వాల్, ప్రకాష్ రాజ్, నవీన్ చంద్ర, తదితరులు

టెక్నికల్ టీమ్

బ్యానర్: అవురమ్ ఆర్ట్స్

స్క్రీన్ ప్లే, మూవీ ప్రెజెంటర్ : శశి కిరణ్ తిక్క

నిర్మాతలు : బాబీ తిక్క,  శ్రీనివాసరావు తక్కలపెల్లి

కో ప్రొడ్యూసర్ - బాలాజీ

సినిమాటోగ్రఫీ - బి విష్ణు

సీఈవో - కుమార్ శ్రీరామనేని

సంగీతం: శ్రీ చరణ్ పాకాల

పీఆర్ఓ: జీఎస్ కే మీడియా (సురేష్ - శ్రీనివాస్)

దర్శకత్వం: సుమన్ చిక్కాల


Post a Comment

Previous Post Next Post