Hero Kartikeya's "Bhaje Vaayu Vegam" first song 'Set Ayyindhe' promo released, full lyrical song on May 9th

 హీరో కార్తికేయ "భజే వాయు వేగం" మొదటి సాంగ్ 'సెట్ అయ్యిందే' ప్రోమో రిలీజ్,  ఈ నెల 9న ఫుల్ లిరికల్ సాంగ్ విడుదల



ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ పై హీరో కార్తికేయ గుమ్మకొండ హీరోగా వస్తున్న "భజే వాయు వేగం" సినిమా టీజర్ ఇటీవల రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి గారు విడుదల చేయగా అనూహ్య స్పందన లభించిన విషయం తెలిసిందే. ఆ ఊపుని కొనసాగిస్తూ చిత్రంలోని మొదటి పాట ‘సెట్ అయ్యిందే’ ఈ నెల 9వ తేదీన ఉదయం 9.09 నిమిషాలకు విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ రోజు ఈ పాట ప్రోమో రిలీజ్ చేశారు. రధన్ కంపోజ్ చేసిన ఈ మాస్ బీట్ సాంగ్ కు సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు. ‘సెట్ అయ్యిందే లైఫ్ సెట్ అయ్యిందే నీ వల్లే నా లైఫ్ సెట్టయ్యిందే, సెట్ అయ్యిందే లైఫ్ సెట్ అయ్యిందే, నా లవ్ స్టోరి బ్లాక్ బస్టర్ హిట్టయ్యిందే..‘ అంటూ సాగిన ఈ 21 సెకన్ల ప్రోమో సాంగ్ ఇంప్రెస్ చేసింది. ఈ ప్రోమోలో కార్తికేయ చేసిన ఎనర్జిటిక్ డాన్స్ స్టెప్స్ హైలైట్ అవుతున్నాయి. ఫుల్ సాంగ్ లో కార్తికేయ, ఐశ్వర్య మీనన్ జంట వైరల్ అవ్వగలిగే ఓ హుక్ స్టెప్ తో ఆకట్టుకోనున్నారు.


"భజే వాయు వేగం" చిత్రంలో హ్యాపీ డేస్ ఫేమ్ రాహుల్ టైసన్ కీలక పాత్రను పోషిస్తున్నాడు. ఈ సినిమాకు ప్రశాంత్ రెడ్డి చంద్రపు దర్శకత్వం వహిస్తున్నారు. అజయ్ కుమార్ రాజు.పి. కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు.


సినిమా థియేట్రికల్ రిలీజ్ డేట్ ను, ట్రైలర్ ని త్వరలోనే అనౌన్స్ చేయబోతున్నారు.


నటీనటులు - కార్తికేయ గుమ్మకొండ, ఐశ్వర్య మీనన్, రాహుల్ టైసన్, తనికెళ్ల భరణి, రవిశంకర్, శరత్ లోహితస్వ తదితరులు


టెక్నికల్ టీమ్-

మాటలు: మధు శ్రీనివాస్

ఆర్ట్: గాంధీ నడికుడికర్

ఎడిటర్: సత్య జి

సినిమాటోగ్రఫీ: ఆర్.డి రాజశేఖర్

మ్యూజిక్ (పాటలు) - రధన్

బ్యాక్ గ్రౌండ్ స్కోర్ - కపిల్ కుమార్

పీఆర్ఓ - జీఎస్ కే మీడియా (సురేష్-శ్రీనివాస్)

కో ప్రొడ్యూసర్ - అజయ్ కుమార్ రాజు.పి

ప్రొడ్యూసర్: యూవీ కాన్సెప్ట్స్

దర్శకుడు: ప్రశాంత్ రెడ్డి చంద్రపు

Post a Comment

Previous Post Next Post