Hero Anand Deverakonda six-pack look in "Gam Gam Ganesha"

"గం..గం..గణేశా"లో సిక్స్ ప్యాక్ లుక్ లో కనిపించనున్న హీరో ఆనంద్ దేవరకొండ



తన ప్రతి సినిమాకు కథల ఎంపికలో కొత్తదనం చూపిస్తూ వస్తున్నారు యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ. ఈసారి "గం..గం..గణేశా" కోసం తన లుక్ కూడా మార్చేశారు. ఆయన ఫస్ట్ టైమ్ ఈ సినిమాలో సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించబోతున్నారు. సిక్స్ ప్యాక్ తో తన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు ఆనంద్ దేవరకొండ. "గం..గం..గణేశా" యాక్షన్ క్రైమ్ కామెడీ మూవీగా ఈ నెల 31న థియేటర్స్ లోకి రాబోతోంది.


ఆనంద్ సరసన ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాను హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. ఉదయ్ శెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. "గం..గం..గణేశా" ట్రైలర్ ను రేపు సాయంత్రం 4 గంటలకు విడుదల చేయబోతున్నారు. ఈ మంత్ ఎండ్ లో వస్తున్న చిత్రాల్లో ఒక కొత్త ప్రయత్నంగా "గం..గం..గణేశా" ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగిస్తోంది. 

Post a Comment

Previous Post Next Post