Mega Daughter Niharika Konidela's upcoming film with newcomers titled "Committee Kurrollu"

 నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందుతోన్నచిత్రం ‘కమిటీ కుర్రోళ్లు’ టైటిల్ పోస్టర్ విడుదల చేసిన సుప్రీమ్ హీరో సాయి దుర్గా తేజ్



నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై ప్రొడక్షన్ నెం.1 చిత్రానికి ‘కమిటీ కుర్రోళ్లు’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. తెలుగు సంవత్సరాది ఉగాది సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్‌ను సుప్రీమ్ హీరో సాయి దుర్గా తేజ్ విడుదల చేసి చిత్ర యూనిట్‌కు అభినందనలుత తెలిపారు. ఈ సందర్భంగా...


నిర్మాత నిహారిక కొణిదెల మాట్లాడుతూ ‘‘మా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ మీద చేసిన తొలి సినిమా కమిటీ కుర్రోళ్లు. ఉగాది సందర్భంగా టైటిల్ పోస్టర్ విడుదల చేశాం. పోస్టర్ విడుదల చేసిన హీరో సాయి దుర్గా తేజ్‌గారికి థాంక్స్. శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ వారు కలిసి ఈ సినిమాను నిర్మించటం చాలా హ్యాపీగా ఉంది. ఇంత మంది కొత్త వాళ్లతో సినిమా చేయటం పెద్ద బాధ్యతగా భావిస్తున్నాం. సినిమాకు ‘కమిటీ కుర్రోళ్లు’ అనే టైటిల్ పెట్టాం. అలాంటి టైటిల్ ఎందుకు పెట్టామనేది సినిమా చూడాల్సిందే.  యదు వంశీగారు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తప్పకుండా అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాం’’ అన్నారు.


చిత్ర దర్శకుడు యదు వంశీ మాట్లాడుతూ ‘‘టైటిల్ పోస్టర్ రిలీజ్ చేసిన సాయి దుర్గా తేజ్ గారికి థాంక్స్. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై కమిటీ కుర్రోళ్లు సినిమా చేస్తున్నాం.   కొత్తవాళ్లతో ఈ సినిమా చేయటం ఆనందంగా ఉంది. ఇందులో 11 మంది హీరోలు, 4 హీరోయిన్స్‌ని పరిచయం చేస్తున్నాం. నాకు ఇచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకుంటామని నమ్ముతున్నాం. షూటింగ్ పూర్తయ్యింది’’ అన్నారు.


శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ ఫణి, జయలక్ష్మి మాట్లాడుతూ ‘‘ మా మూవీ కమిటీ కుర్రోళ్లు సినిమా టైటిల్ పోస్టర్ విడుదల చేసిన హీరో సాయి దుర్గా తేజ్‌కి ధన్యవాదాలు. మంచి కంటెంట్ ఉన్న సినిమాలను ప్రొడ్యూస్ చేయాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చాం. ఈ జర్నీలో పింక్ ఎలిఫెంట్ మాకు తోడుగా రావటం చాలా హ్యాపీగా ఉంది. కంటెంట్ ఈజ్ కింగ్. అందువల్లే డిఫరెంట్ కంటెంట్‌ చేసిన మా సినిమాకు ‘కమిటీ కుర్రోళ్లు’ అనే టైటిల్ పెట్టాం. పోస్టర్ విడుదల చేశాం.  తప్పకుండా సినిమా అందరినీ ఎంటర్‌టైన్ చేస్తుంది’’ అన్నారు.


నటీనటులు :


సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు,త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా, మణికంఠ పరసు, లోకేష్ కుమార్ పరిమి, శ్యామ్ కళ్యాణ్, రఘువరన్, శివకుమార్ మట్ట, అక్షయ్ శ్రీనివాస్, శరణ్య సురేష్, తేజస్వి రావు, టీన శ్రావ్య,విషిక, షణ్ముకి నాగుమంత్రి ..ముఖ్య పాత్రల్లో సాయి కుమార్ ,గోపరాజు రమణ,బలగం జయరాం,శ్రీ లక్ష్మి ,కంచెరపాలెం కిషోర్ ,కిట్టయ్య ,రమణ భార్గవ్,జబర్దస్త్ సత్తిపండు తదితరులు


సాంకతిక వర్గం :


సమర్పణ - నిహారిక కొణిదెల, బ్యానర్స్- పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్, నిర్మాతలు - పద్మజ కొణిదెల,జయలక్ష్మి అడపాక,  రచన, దర్శకత్వం - యదు వంశీ, సినిమాటోగ్రఫీ - రాజు ఎడురోలు, మ్యూజిక్ డైరెక్టర్ - అనుదీప్ దేవ్,  ప్రొడక్షన్ డిజైనర్ - ప్రణయ్ నైని, ఎడిటర్ - అన్వర్ అలీ, డైలాగ్స్ - వెంకట సుభాష్  చీర్ల, కొండల రావు అడ్డగళ్ల,  ఫైట్స్ - విజయ్,

నృత్యం - జె.డి మాస్టర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - మన్యం రమేష్, పి.ఆర్.ఒ- బియాండ్ మీడియా (నాయుడు సురేంద్ర కుమార్ - ఫణి కందుకూరి).


Post a Comment

Previous Post Next Post