Family Star Team surprise Visit to a physically challenged girl who brought their family to the next level

 దివ్యాంగురాలైన రియల్ ఫ్యామిలీస్టార్ ను కలిసి సర్ ప్రైజ్ చేసిన ఫ్యామిలీ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, నిర్మాత దిల్ రాజు, దర్శకుడు పరశురామ్.




తన కుటుంబానికి సపోర్ట్ గా నిలబడే ప్రతి ఒక్కరూ ఫ్యామిలీ స్టారే అనే కాన్సెప్ట్ తో రూపొందిన ఫ్యామిలీ స్టార్ మూవీ సక్సెస్ ఫుల్ గా థియేటర్స్ లో ప్రదర్శింపబడుతోంది. ఈ సినిమాలోని కాన్సెప్ట్ లాగే రియల్ లైఫ్ లోని ఫ్యామిలీ స్టార్స్ దగ్గరకు వెళ్లి సర్ ప్రైజ్ విజిటింగ్ చేస్తోంది ఫ్యామిలీ స్టార్ టీమ్. మీమర్స్ తో నిర్మాత దిల్ రాజు మీట్ లో ప్రశాంత్ అనే మీమర్ తమ కుటుంబంలో ఫ్యామిలీ స్టార్ తన సోదరి స్వరూప అని చెప్పి దివ్యాంగురాలైన తన సోదరి కుటుంబానికి ఎలా అండగా నిలబడిందో వివరించాడు. అతని మాటలు విన్న నిర్మాత దిల్ రాజు మీ ఇంటికి వస్తామని మాటిచ్చారు.


మాటిచ్చినట్లే ఇవాళ హీరో విజయ్ దేవరకొండ, నిర్మాత దిల్ రాజు , దర్శకుడు పరశురామ్ హైదరాబాద్ సూరారంలోని ఆ సోదరి ఇంటికి వెళ్లారు. తమ ఇంటికి విజయ్, దిల్ రాజు రాకతో ఆమె సర్ ప్రైజ్ అయ్యింది. ఆ కుటుంబంతో కాసేపు మాట్లాడారు దిల్ రాజు, విజయ్ దేవరకొండ. ఫ్యామిలీ స్టార్ సినిమాను కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేశామని, విజయ్, బామ్మ మధ్య వచ్చే సీన్స్ నవ్వించాయని, ఫ్యామిలీ స్టార్ లోని క్యారెక్టర్స్ తో, ఎమోషన్స్ తో బాగా రిలేట్ అయ్యామని ఆ ఫ్యామిలీ మెంబర్స్ నిర్మాత దిల్ రాజు, హీరో విజయ్ దేవరకొండకు చెప్పారు. ఇలాగే త్వరలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని రియల్ ఫ్యామిలీ స్టార్స్ ను ఫ్యామిలీ స్టార్ టీమ్ సర్ ప్రైజ్ విజిట్ చేయనుంది.


Post a Comment

Previous Post Next Post