Home » » Bullet Movie 50days Celebration

Bullet Movie 50days Celebration

 విజయవంతంగా 50 రోజులు పూర్తిచేసుకున్న బుల్లెట్ చిత్రం



బుల్లెట్ చిత్రం కాదు.. మంచి సినిమా


శ్రీ బండి సదానంద్ & మెమరీ మేకర్స్ సోమిసెట్టి హరికృష్ణ సమర్పించు, తుమ్మూరు  కోట ఫిలిం సర్క్యూట్ బ్యానర్ పై నిర్మించిన చిత్రం *బుల్లెట్*. ఎవ్వడికైనా దిగుద్ది ట్యాగ్ లైన్ తో దర్శకుడు చౌడప్ప రూపొందించారు. 
 హీరో రవి వర్మ, సంజనా సింగ్, ఆలోక్ జైన్ ,మనీషా దేవ్, జీవ ,విజయ రంగరాజు ,సంధ్య శ్రీ, నర్సింగ్ యాదవ్, జబర్దస్త్ అప్పారావు ప్రధాన పాత్రలు పోషించారు.  మార్చి 8న  విడుదలైన ఈ చిత్రం 50 రోజులు పూర్తి చేసుకొని సక్సెస్ ఫుల్ గా ఇంకా థియేటర్లో కొనసాగుతుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ శుక్రవారం సాయంత్రం హైదరాబాదులోని ప్రసాద్ ల్యాబ్స్ లో ఈ చిత్ర 50 రోజుల వేడుకను నిర్వహించారు. 

ముఖ్య అతిథులుగా శోభారాణి, దర్శకులు వి సముద్ర హాజరయ్యారు. 

శోభారాణి గారు మాట్లాడుతూ.."చిన్న చిత్రాలు రెండు మూడు రోజులు కూడా ఆడని ఈ రోజుల్లో *బుల్లెట్* 50 రోజులు పూర్తి చేసుకొని ఇంకా సక్సెస్ ఫుల్ గా రన్ అవడం మామూలు విషయం కాదు. *బుల్లెట్* ఇప్పుడు చిన్న సినిమా కాదు మంచి చిత్రంగా పేరు తెచ్చుకుంది. దర్శకుడు చౌడప్ప గారికి నా అభినందనలు తెలియజేస్తున్నా. ఆయన డైరెక్టర్ గా మరిన్ని మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నా. టీమ్ అందరికీ కంగ్రాట్యులేషన్స్" అని చెప్పారు. 

దర్శకుడు వి సముద్ర మాట్లాడుతూ.."బుల్లెట్ చిత్రం 50 రోజుల వేడుక చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. గోపీచంద్ ప్రభాస్ లాగా ఈ చిత్రంలోని హీరో రవివర్మ కూడా చాలా హైట్ ఉన్నాడు. తను కూడా వాళ్ళ లాగా సక్సెస్ అవ్వాలని కోరుతూ అందరికీ ఆల్ ద బెస్ట్" అని అన్నారు. 

హీరో రవివర్మ మాట్లాడుతూ.."మా సినిమాని ఇంతలా సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు. నేను నటించిన మొదటి చిత్రమే 50 రోజులు పూర్తి చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది" అని చెప్పారు. 

దర్శకుడు చౌడప్ప మాట్లాడుతూ.."మంచి చిత్రాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. మా చిత్రానికి ఇంత పెద్ద విజయాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి థాంక్స్" అని చెప్పారు.

నిర్మాత గోపాల్ గారు మాట్లాడుతూ.."ఈ సినిమా విజయం పై మొదటి నుంచి నమ్మకంగా ఉన్నాం. అనుకున్నట్టుగా విజయం సాధించడంతో పాటు 50 రోజులు వేడుక జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. దర్శకుడు చౌడప్ప పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కింది. ఆయనకు నా అభినందనలు తెలియజేస్తున్నా" అని అన్నారు. 
చిత్ర యూనిట్ అంతా ఈ కార్యక్రమంలో పాల్గొని సంతోషం వ్యక్తం చేశారు. 

 
నటీనటులు
హీరో రవి వర్మ, సంజనా సింగ్, ఆలోక్ జైన్ ,మనీషా దేవ్, జీవ ,విజయ రంగరాజు ,సంధ్య శ్రీ, నర్సింగ్ యాదవ్, జబర్దస్త్ అప్పారావు, సందీప్ రెడ్డి ,ఆనంద్ జాషువా,  వైజాగ్ ప్రసాద్ ,గిరిధర్, మల్లికార్జున రావు, జగన్ తదితరులు

 సాంకేతిక నిపుణులు
నిర్మాత :- ఎం సి రావు ,జి గోపాల్ ,ఎమ్.వి మల్లి ఖార్జునరావు ,కోసూరి సుబ్రహ్మణ్యం ,మని
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం :- చౌడప్ప
డైరెక్టన్ డిపార్ట్మెంట్ :- సుధీర్ రెడ్డి ,గురునాథం ,వెంకట్ ,శివ
మాటలు :- నివాస్
కెమెరా :- ఆనంద్ మురుకురి
సంగీతం :- సుభాష్ ఆనంద్
ఎడిటర్ :- నందమూరి హరి
బ్యాగ్రౌండ్ స్కోర్, ఆర్.ఆర్ :- చిన్న
ఆర్ట్స్ :- రామకృష్ణ
మేకప్ :- శివ
క్యాస్ట్యూమ్స్ :- నాగరాజు
ప్రొడక్షన్ మేనేజర్ :- బాబు
పి.ఆర్.ఓ :- హర్ష


Share this article :