Home » » Young Producer and Distributor Dheeraj Mogilineni Expending his Network to Ceded

Young Producer and Distributor Dheeraj Mogilineni Expending his Network to Ceded

తిరుపతిలో డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ ఓపెన్ చేసిన సక్సెస్ ఫుల్ యంగ్ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని




ఊర్వశివో రాక్షసివో, బేబి, అంబాజీపేట మ్యారేజి బ్యాండు వంటి విజయవంతమైన చిత్రాలతో సక్సెస్ ఫుల్ యంగ్ ప్రొడ్యూసర్ గా టాలీవుడ్ లో పేరు తెచ్చుకున్నారు ధీరజ్ మొగిలినేని. ఆయన ప్రొడ్యూసర్ గానే కాదు సక్సెస్ ఫుల్ డిస్ట్రిబ్యూటర్ గా పలు సూపర్ హిట్ సినిమాలను పంపిణీచేస్తున్నారు. బేబి, గుంటూరు కారం, హనుమాన్, గామి వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ ను పంపిణీ చేసి డిస్ట్రిబ్యూషన్ రంగంలో దూసుకెళ్తున్నారు ధీరజ్ మొగలినేని.


ఆయన తాజాగా సీడెడ్ ఏరియా పంపిణీ రంగంలోకి అడుగుపెట్టారు. ప్రముఖ సీడెడ్ డిస్ట్రిబ్యూటర్ యతితో కలిసి తిరుపతిలో డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ ఓపెన్ చేశారు ధీరజ్ మొగిలినేని. ప్రస్తుతం ఆయన శ్రీ విష్ణు హీరోగా నటించిన 'ఓం భీమ్ బుష్', సిద్దు జొన్నలగడ్డ 'టిల్లు స్క్వేర్'తో పాటు మరికొన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. తిరుపతిలో ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్స్ ఆఫీస్ ఓపెన్ సందర్భంగా ఆయనకు ఇండస్ట్రీ మిత్రులు, శ్రేయోభిలాషులు, సన్నిహితుల నుంచి శుభాకాంక్షలు అందుతున్నాయి.



Share this article :