ఉలగనాయగన్ కమల్ హాసన్ నిర్మాణంలో శ్రుతి హాసన్ సంగీతంలో లోకేష్ కనగరాజ్ నటిస్తున్న "ఇనిమెల్" మ్యూజిక్ వీడియో
ఉలగనాయగన్ కమల్ హాసన్ తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానున్న మ్యూజిక్ వీడియో 'ఇనిమెల్'తో లోకేష్ కనగరాజ్ ను నటుడిగా పరిచయం చేస్తున్నారు. ఆర్‌కెఎఫ్‌ఐ బ్యానర్ పై కమల్‌హాసన్, ఆర్ మహేంద్రన్ సంయుక్తంగా ఈ మ్యూజిక్ వీడియోను నిర్మిస్తున్నారు.
మ్యూజిక్ వీడియో ఇనిమెల్‌ను వెరీ ట్యాలెంటెడ్ శృతి హాసన్ స్వరపరిచి, కాన్సెప్ట్ చేశారు. ఈ వీడియోలో లోకేష్ కనగరాజ్‌తో పాటు కనిపించనున్నారు. కమల్ హాసన్ ఇనిమెల్ కు లిరిక్ రైటర్ కూడా.
కమల్ హాసన్, లోకేష్ కనగరాజ్ గతంలో 'విక్రమ్' అనే సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అందించారు. ద్వారకేష్ ప్రబాకర్ దర్శకత్వం వహించిన ఈ మ్యూజిక్ వీడియో కోసం వారు మళ్లీ చేతులు కలిపారు. భువన్ గౌడ సినిమాటోగ్రాఫర్, ఫిలోమిన్ రాజ్ ఎడిటర్. శ్రీరామ్ అయ్యంగార్ ప్రొడక్షన్ డిజైనర్.
ఇనిమెల్ మ్యూజిక్ వీడియో త్వరలో విడుదల కానుంది.
Post a Comment