Studio Green's DUET team wishes Anand Deverakonda, Happy Birthday with vibrant poster

"డ్యూయెట్" సినిమాలో మదన్ క్యారెక్టర్ లో ఆనంద్ దేవరకొండ, ఇవాళ ఆయన పుట్టినరోజు సందర్భంగా రిలీజ్





ఆనంద్ దేవరకొండ నటిస్తున్న యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ "డ్యూయెట్". ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. మధుర శ్రీధర్ రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మిథున్ వరదరాజ కృష్ణన్ "డ్యూయెట్"తో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రంలో రితిక నాయక్ హీరోయిన్ గా నటిస్తోంది. 

ఇవాళ ఆనంద్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాలో ఆయన నటిస్తున్న మదన్ క్యారెక్టర్ లుక్ ను రిలీజ్ చేశారు. మనసంతా ప్రేయసిని నింపుకున్న ప్రేమికుడిగా ఆనంద్ దేవరకొండ ఈ లుక్ లో కనిపిస్తున్నారు. త్వరలోనే "డ్యూయెట్" సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేస్తామని మేకర్స్ అనౌన్స్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణలో ఉంది. ఓ డిఫరెంట్ ప్రేమ కథగా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించేలా "డ్యూయెట్" సినిమాను రూపొందిస్తున్నారు.


నటీనటులు - ఆనంద్ దేవరకొండ, రితిక నాయక్, రావు రమేష్, తదితరులు

టెక్నికల్ టీమ్ 

స్టూడియో గ్రీన్ టీమ్ - నేహా జ్ఞానవేల్ రాజా, జి. ధనుంజయన్, ఎ.జి.రాజా, మురళీ కృష్ణ
సినిమాటోగ్రఫీ - అరుణ్ రాధాకృష్ణన్
ఎడిటింగ్ - జి.కె. ప్రసన్న
ప్రొడక్షన్ డిజైనర్ - ఉదయ్ కుమార్
సంగీతం - జి.వి. ప్రకాష్ కుమార్
పీఆర్ఓ- జీఎస్ కె మీడియా
బ్యానర్ - స్టూడియో గ్రీన్
సహ నిర్మాత - మధుర శ్రీధర్ రెడ్డి
నిర్మాత - కె.ఇ. జ్ఞానవేల్ రాజా
రచన, దర్శకత్వం - మిథున్ వరదరాజ కృష్ణన్

Post a Comment

Previous Post Next Post