Prabhudeva Premikudu Re Release Soon

 ప్రభుదేవ నటించిన సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ మూవీ ప్రేమికుడు గ్రాండ్ రీ రిలీజ్



కే టి  కుంజుమన్ నిర్మాతగా, ఎస్. శంకర్ దర్శకత్వంలో, ఏ. ఆర్. రెహమాన్ మ్యూజిక్ అందించగా డాన్సర్, యాక్టర్ ప్రభుదేవ, అందాల నటి నగ్మ నటించిన ప్రేమికుడు సినిమా రీ-రిలీజ్ అవబోతోంది. ప్రస్తుతం ఈ సినిమా రిలీజ్ నిర్మాతలుగా రమణ గారు, మురళీధర్ గారు వ్యవహరిస్తున్నారు. ఎస్పీ బాలసుబ్రమణ్యం, వడివేలు, రఘువరన్, గిరీష్ కర్నాడ్ ముఖ్యపాత్రలో నటించారు. ఈ సినిమా రీ రిలీజ్ కి సంబంధించిన ప్రెస్ మీట్ నేడు చాలా ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్లో ముఖ్య అతిథులుగా తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్నకుమార్ గారు, ట్రెజరర్ రామ్ సత్యనారాయణ గారు, దర్శకుడు ముప్పలనేని శివ గారు, శివనాగు నర్రా గారు, శోభారాణి గారు, నిర్మాతలు రమణ గారు, మురళీధర్ గారు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా ముప్పలనేని శివ గారు మాట్లాడుతూ : 30 సంవత్సరాల క్రితం వచ్చిన ప్రేమికుడు సినిమా ఇప్పుడు రీ రిలీజ్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. అప్పట్లో ప్రభుదేవ ని చూసి స్ప్రింగ్ లు ఏమన్న మింగాడా అనుకునేవాళ్లం. ఒక మంచి ప్రేమ కథ గా సెన్సేషన్ సృష్టించిన సినిమా ఇప్పుడు మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అందరితోపాటు ఈ సినిమా కోసం నేను కూడా ఎదురు చూస్తున్నాను అన్నారు.


తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్నకుమార్ గారు మాట్లాడుతూ : ఈ సినిమా రీ రిలీజ్ లో కూడా మంచి విజయం అందుకుంటుంది. ఇందులో గానకందరుడు ఎస్. పి. బాలసుబ్రమణ్యం గారి నటన అద్భుతంగా ఉంటుంది. ప్రభుదేవ నటన, డాన్సులు నగ్మ అందాలు ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ. మా సోదరి సుధారాణి గారికి ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.


దర్శకుడు శివనాగు గారు మాట్లాడుతూ : ఈ సినిమా ఈ తరంలో వచ్చుంటే కచ్చితంగా 100 కోట్లు కొట్టే సినిమా అయ్యేది. అప్పుడున్న బడ్జెట్ కి 3 కోట్లతో చేసిన సినిమ ఇప్పుడు ఉన్న కలెక్షన్లకి రీ రిలీజ్ లో 30 కోట్లు సాధిస్తుంది అని ఆశిస్తున్నాను. ఎస్. పి. బాలసుబ్రమణ్యం గారి నటన ఈ సినిమాల అద్భుతంగా ఉంటుంది. ప్రభుదేవా గారి డాన్సులు అలాగే బాలసుబ్రమణ్యం గారితో కూడా డాన్స్ వేయించడం ఈ సినిమాకి హైలెట్. రీ రిలీజ్ లో కూడా ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు.


నిర్మాతలు రమణ మరియు మురళీధర్ గారు మాట్లాడుతూ : 30 సంవత్సరాల క్రితం సెన్సేషన్ సృష్టించిన సినిమా మేము రీ రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. అతి త్వరలో ఫ్రీ రిలీజ్డ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా చేయబోతున్నాం. ఈవెంట్ కి ప్రభుదేవా గారు కూడా హాజరయ్యే విధంగా ప్లాన్ చేస్తున్నాం. రీ రిలీజ్ లో కూడా కలెక్షన్లు సృష్టిస్తుందని ఆశిస్తున్నామన్నారు.


ఈ ఈవెంట్లో ముఖ్య అతిథులుగా తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్నకుమార్ గారు, ట్రెజరర్ రామ్ సత్యనారాయణ గారు, దర్శకుడు ముప్పలనేని శివ గారు, శివనాగు నర్రా గారు, శోభారాణి గారు, నిర్మాతలు రమణ గారు, మురళీధర్ గారు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post