డాక్టర్ సూర్యపవన్ రెడ్డికి పీసీఇండియన్ అచీవర్స్ అవార్డ్
దేశంలో విద్యా, వైద్యం, ఎంటర్ ప్రెన్యూర్ షిప్ రంగాల్లో విశేషంగా సేవ చేసిన వారిని ప్రోత్సహించేందుకు *“పవర్ కారిడార్ నేషనల్ మేగజిన్”* వారు అందించే *ప్రతిష్టాత్మకమైన పీసీ ఇండియన్ అచీవర్స్ అవార్డ్స్ లో తెలంగాణ బిడ్డ, ప్రముఖ డాక్టర్ కోమటిరెడ్డి సూర్యపవన్ రెడ్డి వైద్య రంగం విభాగంలో లో బెస్ట్ అచీవర్ అవార్డును అందుకున్నారు.*
ఇవ్వాల ఢిల్లీలోని హయత్ రిజెన్సీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చేతుల మీదుగా సూర్యపవన్ రెడ్డి ఈ అవార్డును అందుకున్నారు. టైప్-1 చెక్కర వ్యాధి నిర్మూలనలో 23 సంవత్సరాలుగా విశేషంగా వైద్యసేవలు అందిస్తూ.. లక్షలాది చక్కెర వ్యాధిగ్రస్తులను కొత్త జీవితాన్ని అందించినందుకుగాను సూర్యపవన్ రెడ్డి ఈ అవార్డును అందుకున్నారు.
డాక్టర్ కోమటిరెడ్డి సూర్యపవన్ తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీశాఖ మాత్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే శ్రీ రాజగోపాల్ రెడ్డిగారి అన్న కుమారుడు కావడం విశేషం.