Home » » Om bheem Bush Trailer Launched Grandly

Om bheem Bush Trailer Launched Grandly

 ‘ఓం భీమ్ బుష్’ కేవలం నవ్వించాలనే ఉద్దేశంతో చేసిన సినిమా. మార్చి 22న ప్రేక్షకుల నవ్వులకు థియేటర్స్ బద్దలైపోతాయి: ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో శ్రీవిష్ణు    శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, శ్రీ హర్ష కొనుగంటి, యువి క్రియేషన్స్, వి సెల్యులాయిడ్ ‘ఓం భీమ్ బుష్’  ట్రైలర్ గ్రాండ్ గా లాంచ్


హీరో శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, 'హుషారు' ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించిన అవుట్ అండ్ అవుట్- ఎంటర్‌టైనర్ 'ఓం భీమ్ బుష్' తో ప్రేక్షకులని ఆలరించబోతున్నారు. వి సెల్యులాయిడ్, సునీల్ బలుసు కలిసి ఈ సినిమాని నిర్మిస్తుండగా, యువి క్రియేషన్స్ సమర్పిస్తుంది.  టీజర్, ఫస్ట్ సింగిల్‌తో పాజిటివ్ ఇంప్రెషన్‌ని క్రియేట్ చేసింది తర్వాత, మేకర్స్ ఈ రోజు సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ ను లాంచ్ చేశారు .


ముగ్గురూ గ్రామంలోకి వచ్చాక, బ్యాంగ్ బ్రోస్ ఎ టు జెడ్ సొల్యూషన్స్‌ను ఎస్టాబెల్స్ చేయడంతో  ట్రైలర్ ప్రారంభమవుతుంది. ఈ ముగ్గురు వివిధ సమస్యలకు పరిష్కారంగా ట్యాబ్లెట్లతో పౌడర్ తయారు చేసి గ్రామస్తులకు అమ్ముతుంటారు. వారి వ్యాపారం పుంజుకున్నప్పుడు, అఘోరాల సమూహం గ్రామాల్లోకి ప్రవేశించి, రహస్యమైన సంపంగి మహల్‌లో నిధిని కనుగొనమని సవాలు విసురుతుంది. మిగిలిన కథ హాంటెడ్ హౌస్‌లో నిధిని కనుగొనడానికి బ్యాంగ్ బ్రోస్ యొక్క పోరాటాలని గురించి. ఎంటర్ టైన్మెంట్,  యువతను ఆకట్టుకునే అంశాలు కాకుండా, ట్రైలర్ సూచించినట్లుగా సినిమాలో ట్రెజర్ హంట్, హారర్, థ్రిల్లర్ మొదలైన ఇతర అంశాలు ఉన్నాయి.


శ్రీవిష్ణు తన అద్భుతమైన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నారు. సామజవరగమనతో ఇంత పెద్ద హిట్ కొట్టినప్పటికీ, నవ్వులు పంచడానికి ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణలకు సమానమైన స్థానాన్ని కల్పించిన శ్రీవిష్ణును తప్పకుండా అభినందించాలి. వారి స్పాంటేనియస్ డైలాగ్స్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణనిచ్చాయి. ప్రీతి ముకుందన్, అయేషా ఖాన్ హీరోయిన్లుగా కనిపించగా, బ్యాంగ్ బ్రోస్ పాటలో ప్రియా వడ్లమాని అలరించింది శ్రీకాంత్ అయ్యంగార్, ఆదిత్య మీనన్, రచ్చరవి ఇతర ముఖ్య తారాగణం.


కామెడీ సన్నివేశాలను డీల్ చేయడంలో శ్రీ హర్ష కొనుగంటి మరోసారి తన ప్రతిభ చూపించారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకర్షించేలా అన్ని హంగులను సరిగ్గా ప్రజెంట్ చేశాడు. రాజ్ తోట తన కెమెరా పనితనంతో విజువల్స్‌కు వైబ్రేషన్‌ని తీసుకొచ్చాడు, సన్నీ MR తన స్కోర్‌తో హిలేరియస్ మూడ్‌ను సెట్ చేశాడు. V సెల్యులాయిడ్ ప్రొడక్షన్ డిజైన్ లావిష్ గా వుంది. ఓం భీమ్ బుష్ అత్యంత వినోదాత్మకంగా ఉంటుందని ట్రైలర్ ప్రామిస్ చేసింది. ట్రైలర్ తో అంచనాలు మరింతగా పెరిగాయి. ఈ చిత్రం మార్చి 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది.


ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ.. మార్చి 22న థియేటర్స్ కి రండి. మీరు నవ్విన నవ్వులకు థియేటర్స్ బద్దలైపోతాయి. పిచ్చిపిచ్చిగా ఎంజాయ్ చేస్తారు. ఫ్రెండ్స్ గ్రూప్స్ తో వెళితే ఇంక బాగా ఎంజాయ్ చేస్తారు. 22న ఎవరూ మిస్ అవ్వదు. మిమ్మల్ని నవ్వించాలనే ఉద్దేశంతోనే సినిమా చేశాం. రెండు వందల శాతం పిచ్చిపిచ్చిగా నవ్వుతారు. కేవలం ఎంటర్ టైన్మెంట్ ఇవ్వాలని ఫిక్స్ అయి చేసిన సినిమా ఇది. ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన యువీ వంశీ అన్నకి, సునీల్ గారికి ధన్యవాదాలు. దర్శకుడు హర్ష చాలా హిలేరియస్ గా సినిమాని తీశారు. సినిమా యూనిట్ అందరికీ ధన్యవాదాలు’ తెలిపారు.


ప్రియదర్శి మాట్లాడుతూ.. మార్చి 22 తప్పకుండా అందరూ థియేటర్స్ కి రండి. డబుల్ డోస్ ఎంటర్ టైన్మెంట్ ఇస్తామని ప్రామిస్ చేస్తున్నాం. నిర్మాతలు వంశీ గారు, సునీల్ గారు చాలా సపోర్ట్ చేశారు. వారి ప్రోత్సాహం వలనే ఇంత క్రేజీ సినిమా చేయగలిగాం. తప్పకుండా సినిమా మీ అందరినీ అలరిస్తుంది’’ అన్నారు.


శ్రీ హర్ష కొనుగంటి మాట్లాడుతూ.. ట్రైలర్ లో వుండే ఎనర్జీ కంటే సినిమాలో వందరెట్ల ఎనర్జీ వుంటుంది. మార్చి 22న అందరూ గ్యాంగ్స్ తో రండి. టెన్ టైమ్స్ ఎంటర్ టైన్ అవుతారు. అది మా గ్యారెంటీ. మార్చి 22న కలుద్దాం’’ అన్నారు.


నిర్మాత సునీల్ బలుసు మాట్లాడుతూ..‘ఓం భీమ్ బుష్’ మార్చి 22న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తప్పకుండా అందరూ చూడాలి’’ అని కోరారు. చిత్ర యూనిట్ సభ్యులంతా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.


తారాగణం: శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ప్రీతి ముకుందన్, అయేషా ఖాన్, శ్రీకాంత్ అయ్యంగార్, ఆదిత్య మీనన్, రచ్చ రవి తదితరులు.


సాంకేతిక విభాగం:

రచన, దర్శకత్వం: శ్రీ హర్ష కొనుగంటి

ప్రెజెంట్స్: వి  సెల్యులాయిడ్

నిర్మాతలు: వి సెల్యులాయిడ్, సునీల్ బలుసు

డీవోపీ: రాజ్ తోట

సంగీతం: సన్నీ MR

ఆర్ట్ డైరెక్టర్: శ్రీకాంత్ రామిశెట్టి

ఎడిటర్: విజయ్ వర్ధన్

పీఆర్వో: వంశీ-శేఖర్

మార్కెటింగ్: ఫస్ట్ షోShare this article :