Home » » Ika Na Maate From Manamey is out now

Ika Na Maate From Manamey is out now

 శర్వానంద్, శ్రీరామ్ ఆదిత్య, హేషమ్ అబ్దుల్ వహాబ్, టీజీ విశ్వ ప్రసాద్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ 'మనమే' నుండి ఫుట్ ట్యాపింగ్ నంబర్ ఇక నా మాటే విడుదలప్రామిసింగ్ హీరో శర్వానంద్ ల్యాండ్‌మార్క్ 35వ చిత్రం 'మనమే' ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌తో క్యూరియాసిటీని క్రియేట్ చేసింది. టైటిల్ గ్లింప్స్ కూడా చాలా ప్లజంట్ గా ఉంది. ట్యాలెంటెడ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రంలో కృతి శెట్టి కథానాయికగా నటిస్తోంది. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తుండగా, కృతి ప్రసాద్, ఫణి వర్మ ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు. ఏడిద రాజా అసోసియేట్ ప్రొడ్యూసర్


మేకర్స్ ఫస్ట్ సింగిల్- ఇక నా మాటను విడుదల చేయడం ద్వారా మ్యూజిక్ ప్రమోషన్‌లను ప్రారంభించారు. కంపోజర్ హేషమ్ అబ్దుల్ వహాబ్ రీసెంట్ ఆల్బమ్‌లు ఖుషి, హాయ్ నాన్న బ్లాక్‌బస్టర్‌లుగా కావడంతో టాప్ ఫామ్‌ లో వున్న్నారు.  హేషమ్ ట్యూన్ స్కోర్ చేయడంతో పాటు, ఈ ఫుట్ ట్యాపింగ్ పాటకు వోకల్స్ కూడా అందించారు.


ఈ పాటలో ఉపయోగించిన ప్రతి ఇన్స్ట్రుమెంట్ నేచర్ ఎలక్ట్రానిక్. ఇది ఖచ్చితంగా కాలేజ్ కి వెళ్లే యువతలో, ప్రత్యేకంగా సింగిల్స్‌ ను అలరించబోతుంది. కృష్ణ చైతన్య సాహిత్యం సింగిల్ గా ఉండటం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. హేషామ్ అబ్దుల్ వహాబ్ వినగానే ఆకట్టుకునే పాటని అందించారు, అతని వాయిస్ మరింత ఫన్ ని యాడ్ చేసింది  


లండన్‌లోని అద్భుతమైన లొకేషన్‌లను విష్ణు శర్మ,  జ్ఞాన శేఖర్ VS లావిష్ గా చిత్రీకరించారు. శర్వానంద్ గ్రేస్ ఫుల్,  స్టైలిష్ మూవ్‌లు చూడటానికి ట్రీట్‌గా ఉంటాయి. ముఖ్యంగా, హుక్ స్టెప్ యువతని విశేషంగా ఆకట్టుకుంది. శ్రాస్తి వర్మ కొరియోగ్రఫీ చేశారు. శర్వా డ్రెస్సింగ్, స్టైలింగ్ ట్రెండీగా ఉన్నాయి. తన టాప్ ఫామ్‌ను కొనసాగిస్తూ, హేషమ్ అబ్దుల్ వహాబ్ ఇన్స్టంట్  కనెక్ట్ అయ్యే యంగ్ నెంబర్ ని అందించాడు.  శ్రీరామ్ ఆదిత్యకు సంగీతంలో మంచి అభిరుచి ఉంది. మ్యూజికల్ ప్రమోషన్‌లను ప్రారంభించడానికి ఇక నా మాటే సరైన పాట. శర్వానంద్‌ను మునుపెన్నడూ లేని స్టైలిష్ అవతార్‌లో ప్రెజెంట్ చేశారు దర్శకుడు. ప్రొడక్షన్ డిజైన్ గ్రాండ్ గా వుంది.


యూనిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ విక్రమ్ ఆదిత్య కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రముఖ టెక్నీషియన్ ప్రవీణ్ పూడి ఎడిటర్, జానీ షేక్ ఆర్ట్ డైరెక్టర్. ఈ చిత్రానికి డైలాగ్స్‌ని అర్జున్ కార్తిక్, ఠాగూర్, వెంకీ అందిస్తున్నారు.


త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని అనౌన్స్ చేయనున్నారు మేకర్స్.


 తారాగణం: శర్వానంద్, కృతి శెట్టి, విక్రమ్ ఆదిత్య


సాంకేతిక విభాగం:

కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీరామ్ ఆదిత్య

నిర్మాత: టీజీ విశ్వ ప్రసాద్

బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ

సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల

ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: కృతి ప్రసాద్, ఫణి వర్మ

అసోసియేట్ ప్రొడ్యూసర్: ఏడిద రాజా

డైలాగ్స్: అర్జున్ కార్తిక్, ఠాగూర్, వెంకీ

సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాబ్

డీవోపీ : విష్ణు శర్మ, జ్ఞాన శేఖర్ VS

ఎడిటర్: ప్రవీణ్ పూడి

ఆర్ట్: జానీ షేక్

పీఆర్వో: వంశీ-శేఖర్Share this article :