Home » » Hero Sairam Shankar Interview About Vey Daruvey

Hero Sairam Shankar Interview About Vey Daruvey

 ‘వెయ్ దరువెయ్’ చిత్రం 80 శాతం కామెడీ, చిన్న ఫ్యామిలీ ఎమోషనల్ టచ్‌, మెసేజ్‌తో ప్రేక్షకులను మెప్పిస్తుంది : హీరో సాయిరామ్ శంకర్



సాయిరామ్ శంకర్, యషా శివకుమార్, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా లక్ష్మీనారాయణ పొత్తూరు సమర్పణలో సాయి తేజ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నవీన్ రెడ్డి దర్శకత్వంలో దేవరాజ్ పోతూరు నిర్మించిన చిత్రం ‘వెయ్ దరువెయ్’. మార్చి 15న సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా హీరో సాయిరామ్ శంకర్ సినిమా గురించిన విశేషాలను తెలియజేశారు..


 దర్శక నిర్మాతలు కలిసి సినిమా చేయాలనుకున్నారు. స్క్రిప్ట్ అంతా రెడీ కూడా అయ్యింది. నేను కూడా సినిమా చేయాలనుకుంటున్నాను. అప్పుడు కార్తీక్ అనే కామన్ ఫ్రెండ్ మమ్నల్ని కలిపాడు. అలా సినిమా ట్రాక్ ఎక్కింది.


 ‘వెయ్ దరువెయ్’ అనేది కమర్షియల్ టైటిల్ అయినప్పటికీ దానికి జస్టిఫికేషన్ ఉంటుంది. అలాగే హీరో క్యారెక్టర్ జోవియల్‌గా ఉంటుంది. సమాజంలో ఓ సమస్యపై హీరో చేసే చిన్నపాటి పోరాటమే ఈ చిత్రం.


 ‘బంపర్ ఆఫర్’ మూవీ నా బాడీలాంగ్వేజ్‌కి తగ్గట్లు ఉండే చిత్రం. ఆ తర్వాత ఈ కథ నాకు అలా అనిపించింది. కామెడీ నాకు బాగా ఇష్టం. ‘వెయ్ దరువెయ్’ విషయానికి వస్తే ఇందులో 80 శాతం కామెడీ, చిన్న ఫ్యామిలీ ఎమోషనల్ టచ్ ఉంటుంది.


నేను వరుస సినిమాలు చేస్తున్నాను. అయితే అవన్నీ రిలీజ్‌కి సిద్ధమవుతున్నాయి. మార్చి 15న ‘వెయ్ దరువెయ్’ రిలీజ్ అయితే వచ్చే నెలలో ఒక పథకం ప్రకారం, మే నెలలో రీసౌండ్ రిలీజ్ అవుతుంది. ఈ మూడు మూవీస్ చేయటానికి ఐదేళ్ల సమయం పట్టింది. అందుకు కారణం మధ్యలో కోవిడ్ చాలా బాగా డిస్ట్రబ్ చేసేసింది. అలా కొన్ని పరిస్థితులతో కాస్త గ్యాప్ కనిపిస్తుంది.


 ‘వెయ్ దరువెయ్’ మూవీని 35 రోజుల్లో పూర్తి చేశాం. అందుకు కారణం దర్శకుడు నవీన్ రెడ్డి, నిర్మాత దేవరాజ్ పోతూరుగారి ప్లానింగ్. ఇందులో నాలుగు పాటలు, ఫైట్స్ ఉన్నప్పటికీ అంత త్వరగా పూర్తి చేయటానికి వారు ముందు చేసుకున్న ప్రీ ప్రొడక్షన్ వర్క్ తో పాటు అందరూ ఇచ్చిన సపోర్ట్ అనే చెప్పాలి.


 ఆడియెన్స్‌ను సినిమా ఎంగేజ్ చేస్తే చాలు. సినిమా సక్సెస్‌ను వాళ్లు డిసైడ్ చేస్తారు. ఫార్మేట్‌లతో వాళ్లకు సంబంధం ఉండదు.

 నాతో పాటు చాలా మంది స్టార్ యాక్టర్స్ నటించారు. సత్యం రాజేష్, సునీల్, చమ్మక్ చంద్ర, థర్టీ ఇయర్స్ పృథ్వీ, పోసాని, అదుర్స్ రఘు, కాశీ విశ్వనాథ్ అందరూ తమదైన నటనతో మెప్పిస్తారు.


 దర్శకుడు నవీన్ గారు ఏ కథనైతే అనుకున్నారో అదే సినిమాగా తెరకెక్కించారు. నాకు బాడీలాంగ్వేజ్‌కి సూట్ అయ్యే క్యారెక్టర్ లో మెప్పిస్తాను. నాకు టేకాఫ్‌కి ఉపయోగపడే సినిమా అవుతుందనిపిస్తుంది.


 నిర్మాత దేవరాజ్‌గారు ఇతర వ్యాపారంలో ఉన్నప్పటికీ సినిమాలంటే ఆసక్తి. సినిమాను ఇంత త్వరగా పూర్తి చేశామంటే ముందు దేవరాజ్ గారు తీసుకున్న చొరవే. దర్శకుడితో కలిసి ముందుగానే మంచిగా ప్లాన్ చేసుకున్నారు.


 సునీల్ గారు మెయిన్ విలన్. ఆయన బిజీగా ఉన్నప్పటికీ నేను స్పెషల్ గా వెళ్లి కలవటంతో డేట్స్ అడ్జస్ట్ చేసిచ్చారు. హీరోయిన్ యశ ఇందులో మంచి రోల్ చేసింది. ఇద్దరూ అట్యిట్యూడ్  ఉన్న పాత్రల్లో కనిపిస్తాం. హెబ్బా పటేల్ గారు ఓ స్పెషల్ సాంగ్ లో కనిపిస్తారు.


 భీమ్స్ గారు మంచి సాంగ్సే కాదు.. మంచి బ్యాగ్రౌండ్ స్కోర్ ను అందించారు. ఫస్ట్ కాపీ చూడగానే అర్థమైంది.


 ‘బంపర్ ఆఫర్ 2’ను ఎప్పుడో అనౌన్స్ చేస్తాం. తప్పకుండా సినిమా ఉంటుంది. కరోనా వేవ్స్ సమయంలో సినిమాను ఆపాం. త్రివిక్రమ్ గారి దగ్గర వర్క్ చేసే అశోక్ గారు కథను తయారు చేశారు. దాన్ని ఆయన ఇంకెవరికీ ఇవ్వను మీకే ఇస్తానని అన్నారు.


 అన్నయ్యను నాతో సినిమా చేయాలని ఇబ్బంది పెట్టాను. వీడికి ఇది అవసరం అనుకుంటే ఆయనే చేస్తారు. ప్రమోషన్స్ విషయంలోనూ అంతే



Share this article :