Hello Baby Promotional Song Launched by Naveena Chandra

హలో బేబీ ప్రమోషనల్ సాంగ్ ను లాంచ్ చేసిన హీరో నవీన్ చంద్ర



ఎస్ కె యల్ ఎమ్ పిక్చర్స్తా పతాకంపై  కాండ్రేగుల ఆదినారాయణ నిర్మాతగా, రాంగోపాల్ రత్నం దర్శకత్వంలో కావ్య కీర్తి నటించిన 

హలో బేబీ చిత్రం ప్రమోషనల్  సాంగ్ ను హీరో నవీన్ చంద్ర లాంచ్ చేశారు. హాల్లో బాయ్స్ లెట్స్ డు పార్టీ అని మొదలుపెట్టిన ఈ పాటను సింగర్ సాయి చరణ్ అద్భుతంగా పాడారు ఈ పాటను రాజేష్ లోక్నాథం రాశారు. 

 హీరో నవీన్ చంద్ర మాట్లాడుతూ సోలో క్యారెక్టర్ లో భారతదేశంలోనే మొట్టమొదటి హాకింగ్ చిత్రం కి ఆల్ ద బెస్ట్. ఇలాంటి చిత్రాలు చేయడానికి నిజంగా సాహసం ఉండాలి. అలాంటి సాహసం చేసిన నిర్మాత కాండ్రేగుల ఆదినారాయణ కు దర్శకుడు రామ్ గోపాల్ రత్నం కు శుభాకాంక్షలు అని అన్నారు.


 నిర్మాత కాండ్రేగుల ఆదినారాయణ మాట్లాడుతూq సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఏప్రిల్ లో విడుదలకు సిద్ధం కాబోతుంది. ఈ పాట కేవలం ప్రమోషనల్ సాంగ్ మాత్రమే. దీని కొరియోగ్రాఫర్ గా మహేష్ చాలా అద్భుతంగా తీర్చి దిద్దారు. ఈ చిత్రానికి మ్యూజిక్ సుకుమార్ పమ్మి ,ఎడిటర్ సాయిరాం తాటిపల్లి.

ఈ చిత్రం ఒకే ఒక క్యారెక్టర్ తో కావ్య కీర్తి నటనతో త్వరలో ప్రేక్షకుల దగ్గరికి రాబోతుంది. కొత్త ప్రయోగాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుకుంటున్నాను అని అన్నారు.

Post a Comment

Previous Post Next Post