Happy Days Re Release on April 12th

 సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల యూత్ ఫుల్ కల్ట్ క్లాసిక్ 'హ్యాపీ డేస్' ఏప్రిల్ 12న గ్రాండ్ గా రీ-రిలీజ్



నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 2007లో విడుదలైన 'హ్యాపీ డేస్' యూత్ ఫుల్ కల్ట్ క్లాసిక్ గా ప్రేక్షకులని అలరించింది. ప్రేక్షకులు, విమర్శకుల ప్రసంశలతో పాటు అద్భుతమైన కలెక్షన్స్ తో బాక్సాఫీసు వద్ద సంచలన విజయం సాధించింది. యూత్ ఫుల్ చిత్రాలలో ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన 'హ్యాపీ డేస్' మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సమ్మర్ స్పెషల్ గా ఏప్రిల్ 12న ఈ చిత్రాన్ని రీరిలీజ్ చేస్తున్నారు. గ్లోబల్ సినిమాస్ ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో చాలా గ్రాండ్ గా రీరిలీజ్ కానుంది.


వరుణ్ సందేశ్, తమన్నా భాటియా, నిఖిల్ సిద్ధార్థ్ లాంటి న్యూ కమ్మర్స్ తో డైరెక్టర్ శేఖర్ కమ్ముల వెండితెరపై అద్భుతమైన మ్యాజిక్ చేశారు. శేఖర్ కమ్ముల ఎక్స్ ట్రార్డినరీ డైరెక్షన్, నటీనటులు పెర్ఫార్మెన్స్, మిక్కీ జేమేయర్ చార్ట్ బస్టర్ మ్యూజిక్ ప్రేక్షకుల మనుసులో ఎవర్ గ్రీన్ గా నిలిచాయి.


శేఖర్ కమ్ముల తన అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌   బ్యానర్ పై చిత్రాన్ని చాలా రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ తో నిర్మించారు. విజయ్ సి. కుమార్ డీవోపీగా పని చేసిన ఈ చిత్రానికి మార్తాండ్ కె. వెంకటేష్ ఎడిటర్.


యూత్ ఫుల్ కల్ట్ క్లాసిక్ గా అలరించిన ఈ చిత్రం మరోసారి థియేటర్స్ లో మెస్మరైజింగ్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించనుంది. సో.. గెట్ రెడీ.


Post a Comment

Previous Post Next Post