ZEE5 చరిత్రలోనే ‘హను-మ్యాన్’ గ్లోబల్ సెన్సేషన్.. 11 గంటల్లోనే 102 మిలియన్ వ్యూయింగ్ మినిట్స్‌తో రికార్డ్స్ బ్రేక్
Subscribe ZEE5 and watch it now! 🍿
https://www.zee5.com/movies/details/hanu-man/0-0-1z5531939
సినిమా బాక్సాఫీస్ దగ్గరే ఎవరూ ఊహించని విధంగా సెన్సేషన్ చేయటమే కాదు.. ఓటీటీలో అంతకు మించిన రికార్డులు క్రియేట్ చేయటం అనేది అరుదుగా జరిగే విషయం. అయితే ఈ అరుదైన విషయాన్ని ముందుగానే ఊహించిన వన్ అండ్ ఓన్లీ ఇండియన్ టాప్ డిజిటల్ ఫ్లాట్ ఫామ్ ZEE5. అందుకనే ఇప్పుడు ఇండియాలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా టాప్ ట్రెండింగ్‌తో ZEE5 దూసుకెళ్తోంది. అందుకు కారణం ‘హను-మ్యాన్’. తెలుగువారికే కాదు అన్ని భాషల వారికి వైవిధ్యమైన కథలను అందించడంలో ముందు ఉంటుంది ఓటీటీ ప్లాట్ ఫామ్ ZEE5. ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్‌లో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచిన ‘హను-మ్యాన్’ను మార్చి 17 నుంచి తమ ప్రియమైన ప్రేక్షకుల కోసం స్ట్రీమింగ్ చేస్తోన్న సంగతి తెలిసిందే.
వెర్సటైల్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో కె.నిరంజన్ రెడ్డి నిర్మాతగా ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదలైన ‘హను-మ్యాన్’ చిత్రం ఎవరూ ఊహించని సక్సెస్‌ను సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ దగ్గర రికార్డ్ కలెక్షన్స్‌తో రూ.300కోట్లను సాధించిన ‘హను-మ్యాన్’ తమ జీ 5లో హిస్టరీ క్రియేట్ చేస్తుందని భావించారు. నిజంగా వారి అంచనాలను మించి ఈ చిత్రం రికార్డ్స్ క్రియేట్ చేస్తూ ZEE5 చరిత్రలో తొలి రోజున ఉన్న రికార్డులను తిరగరాసింది. కేవలం 11 గంటల్లోనే 102 మిలియన్ వ్యూయింగ్ మినిట్స్ సాధించటంతో ఆశ్చర్యపోవటం అందరివంతైంది. అంతే కాదండోయ్..2024లో జీ 5ను ప్రపంచ వ్యాప్తంగా హయ్యస్ట్ గ్రాసర్‌గా నిలబెట్టింది ‘హను-మ్యాన్’. పాన్ ఇండియా మూవీగా విడుదలైన ‘హను-మ్యాన్’ను గ్లోబల్ ఆడియెన్స్ ఒరిజినల్ లాంగ్వేజ్‌లోనే చూస్తుండటం విశేషం.
విజువల్స్, భక్తి పారవశ్యంలో మునిగిపోయే సన్నివేశాలు, రోమాలు నిక్కబొడిచే యాక్షన్ సన్నివేశాలు..చక్కటి పాటలు ఇవన్నీ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. అందుకనే పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ వసూళ్లను రాబట్టి రికార్డులను క్రియేట్ చేసిన ‘హను-మ్యాన్’..జీ 5లో సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది.
అంజనాద్రి ప్రాంతంలో ఉండే హనుమంతు (తేజ సజ్జ) అల్లరి చిల్లరగా తిరుగుతుంటాడు. తల్లిదండ్రి లేని హనుమంతుని అక్క అంజనమ్మ (వరలక్ష్మి శరత్ కుమార్) అన్నీ తానై హనుమంతుని పెంచి పెద్దచేస్తుంది. ఆ ప్రాంతంలో అన్యాయం చేస్తోన్న గజపతిని ఓ సందర్భంలో హనుమంతు ఆ ఊళ్లో వైద్యం చేయటానికి వచ్చిన డాక్టర్ మీనాక్షి కారణంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. మీనాక్షిని హనుమంతు చిన్నప్పటి నుంచి ఇష్టపడుతుంటాడు. గజపతి కారణంగా హనుమంతు ప్రమాదంలో చిక్కుకుంటే అతని ఆంజనేయ స్వామికి సంబంధించిన ఓ అపూర్వశక్తి దొరుకుతుంది. దాంతో అతను ప్రజలకు మంచి చేస్తుంటాడు. చివరకు విషయం విలన్ వరకు చేరుతుంది. అపూర్వ దైవశక్తిని సంపాదించుకోవటానికి ప్రతినాయకుడు ఏం చేశాడు.. అతన్ని మన హీరో ఎలా ఎదుర్కొన్నాడు.. చివరకు ఆంజనేయస్వామి భక్తుడి కోసం ఏం చేశాడనే కథాంశంతో ‘హను-మ్యాన్’ తెరకెక్కింది.
జీ5 గురించి:
జీ5 భారతదేశపు యంగస్ట్ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్. మల్టీలింగ్వుల్ స్టోరీటెల్లర్‌గా ప్రసిద్ధి పొందింది. మిలియన్ల కొద్దీ అభిమానులను సంపాదించుకుంది. గ్లోబల్ కంటెంట్ పవర్ హౌస్ జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ (జీఎల్) నుంచి శాఖగా మొదలైంది జీ5. అత్యద్భుతమైన వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్ గా పేరు తెచ్చుకుంది. 3,500 సినిమాల లైబ్రరీ ఉన్న ప్లాట్‌ఫార్మ్ ఇది. 1,750 టీవీ షోలు, 700 ఒరిజినల్స్, 5 లక్షలకు పైగా ఆన్ డిమాండ్ కంటెంట్ ఈ సంస్థ సొంతం. 12 భాషల్లో (హిందీ, ఇంగ్లిష్, బెంగాలీ, మలయాళం, తెలుగు, తమిళ్, మరాఠీ, ఒరియా, భోజ్‌పురి, గుజరాతీ, పంజాబీ)లో అందుబాటులో ఉంది. బెస్ట్ ఒరిజినల్స్, ఇంటర్నేషనల్ మూవీస్, టీవీ షోస్, మ్యూజిక్, కిడ్స్ షోస్, ఎడ్‌టెక్, సినీ ప్లేస్, న్యూస్, లైవ్ టీవీ, హెల్త్, లైఫ్‌స్టైల్ విభాగాల్లో ప్రేక్షకులను రంజింపజేస్తోంది. ఇంత గొప్ప డీప్ టెక్ స్టాక్ నుంచి ఎదిగిన ప్లాట్‌పార్మ్ కావడంతో జీ5 12 భాషల్లో అత్యద్భుతమైన కంటెంట్‌ని ప్రేక్షకులకు అందించగలుగుతోంది.