Home » » Emito Emito Lyrical Song Out From Sasivadane

Emito Emito Lyrical Song Out From Sasivadane

 రక్షిత్ అట్లూరి, కోమలి హీరో హీరోయిన్ గా నటించిన గ్రామీణ ప్రేమకథా చిత్రం ‘శశివదనే’ నుంచి ‘ఏమిటో ఏమిటో..’  లిరికల్ సాంగ్ రిలీజ్







‘పలాస 1978’లో అద్భుతమైన నటనతో అందరి ప్రశంసలు అందుకున్న రక్షిత్ అట్లూరి కథానాయకుడిగా నటిస్తోన్న చిత్రం ‘శశివదనే’. కోమలి కథానాయికగా నటిస్తోంది.  ‘మనసులో పుట్టే ప్రేమ మచ్చలేనిదైతే ఆ ప్రేమకు మరణం కూడా మనతోనే’ అంటూ  హృదయాన్ని హత్తుకునే గ్రామీణ నేపథ్యంలో ప్రేమకథాంశంగా తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 5న గ్రాండ్ రిలీజ్ అవుతోంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ పాటలు, టీజర్‌కు అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో శుక్రవారం మేకర్స్ ఈ సినిమా నుంచి ‘ఏమిటో ఏమిటో..’ అనే పాటను విడుదల చేశారు. 


హీరోయిన్‌పై మనసుపడ్డ హీరో తన మనసులో చేలరేగె భావాలను పాట రూపంలో వ్యక్తం చేసే క్రమంలో పాట వచ్చే సందర్భంగా అనిపిస్తోంది. అదేంటో తెలుసుకోవాలంటే సినిమా రిలీజ్ వరకు ఆగాల్సిందేనంటున్నారు దర్శక నిర్మాతలు. పి.వి.ఎన్.ఎస్.రోహిత్ పాడిన ఈ పాటను కరుణాకర్ అడిగర్ల రాశారు. శరవణ వాసుదేవన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. 


గౌరీ నాయుడు సమర్పణలో AG ఫిల్మ్ కంపెనీ, SVS స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్‌పై అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోదాల ఈ చిత్రాన్ని నిర్మించారు. రైటర్, డైరెక్టర్ సాయి మోహన్ ఉబ్బన సినిమాను తెరకెక్కించారు. ఇప్పటి వరకు వచ్చిన మూవీ కంటెంట్‌తో.. ఈ ప్రేమకథా చిత్రంలో గోదావరి జిల్లాల అందాలను ఎలా చూపించబోతోన్నారు అనే దానిపై ఓ స్పష్టత వచ్చింది.  


ఈ చిత్రంలో రంగస్థలం మహేష్, శ్రీమాన్, జబర్దస్త్ బాబీ, ప్రవీణ్ యండమూరి మరియు దీపక్ ప్రిన్స్ కీలక పాత్రలు పోషించారు.


నటీనటులు: రక్షిత్ అట్లూరి, కోమలి, శ్రీమన్, దీపక్ ప్రిన్స్, జబర్దస్త్ బాబీ, రంగస్థలం మహేష్ తదితరులు


సాంకేతిక బృందం: 


బ్యానర్స్: AG ఫిల్మ్ కంపెనీ, SVS స్టూడియోస్

సమర్పణ : గౌరీ నాయుడు

రచన,దర్శకత్వం: సాయిమోహన్ ఉబ్బన

నిర్మాతలు: అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోదాల

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: శ్రీపాల్ చొల్లేటి

సంగీతం: శరవణ వాసుదేవన్

బ్యాక్ గ్రౌండ్ స్కోర్: అనుదీప్ దేవ్

సినిమాటోగ్రఫీ: శ్రీ సాయికుమార్ దారా

ఎడిటర్: గ్యారీ బీహెచ్

కొరియోగ్రాఫర్ - జెడి

కాస్ట్యూమ్ డిజైనర్: గౌరీ నాయుడు

నిర్మాణం: AG ఫిల్మ్ కంపెనీ

సీఈవో: ఆశిష్ పెరి

పి.ఆర్.ఒ : బియాండ్ మీడియా (నాయుడు సురేంద్ర కుమార్ - ఫణి)


Share this article :