Home » » Tremendous Response For Yatra 2

Tremendous Response For Yatra 2

 థియేటర్లో మంచి రెస్పాన్స్ వస్తోంది.. ‘యాత్ర 2’ సక్సెస్ మీట్‌లో దర్శకుడు మహి వీ రాఘవ్



ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ దివంగ‌త ముఖ్య‌మంత్రి డాక్ట‌ర్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి పేద‌ల క‌ష్ట‌న‌ష్టాల‌ను తెలుసుకుని వాటిని తీర్చ‌టానికి చేసిన పాద‌యాత్ర ఆధారంగా రూపొందిన సినిమా ‘యాత్ర’. దీనికి కొనసాగింపుగా రూపొందిన చిత్రం ‘యాత్ర 2’. వై.ఎస్‌.ఆర్ పాత్ర‌లో మ‌ల‌యాళ స్టార్ మ‌మ్ముట్టి న‌టించ‌గా ఆయ‌న‌ త‌న‌యుడు వై.ఎస్‌.జ‌గ‌న్ పాత్ర‌లో కోలీవుడ్ స్టార్ జీవా న‌టించారు. 2009 నుంచి 2019 వ‌ర‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌రిగిన రాజ‌కీయ ప‌రిస్థితులు, వై.ఎస్‌.జ‌గ‌న్ పేద‌ల కోసం చేసిన పాద‌యాత్ర ఆధారంగా ‘యాత్ర 2’ చిత్రాన్ని రూపొందించారు. ఫిబ్ర‌వ‌రి 8న విడుద‌ల చేసిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఘన విజయాన్ని సాధించడంతో చిత్రయూనిట్ శుక్రవారం సక్సెస్ మీట్‌ను నిర్వహించింది. ఈ సందర్భంగా దర్శకుడు మహి వీ రాఘవ్ మీడియాతో మాట్లాడుతూ..


‘నేను తీసిన యాత్ర 2 కొందరికి నచ్చింది.. ఇంకొందరికి నచ్చలేదు.. తీసిందే పొలిటికట్ మూవీ, రాజకీయ నాయకుడి మీద కాబట్టి.. భిన్నాభిప్రాయాలు రావడం సహజం. కానీ ఓ స్టోరీ టెల్లర్‌గా, నేను అనుకున్న కథ, స్క్రిప్ట్‌ను తీశాను. చాలా మందికి నా సినిమా నచ్చింది. అందరూ తమ తమ అభిప్రాయాలు పంచుకున్నారు. కొంత మంది పాజిటివ్‌గా రివ్యూ ఇచ్చారు. ఇంకొంత మంది నెగెటివ్ రివ్యూలు ఇచ్చారు. ఫిల్మ్ మేకర్లుగా సినిమాను తీయడం మా బాధ్యత. విమర్శించారు కదా? నేనేమీ దాన్ని డిఫెండ్ చేసుకోను. మా టెక్నికల్ టీంకు థాంక్స్. మమ్ముట్టి గారు, జీవా గారికి థాంక్స్. ఒక సినిమా రిలీజ్ అయ్యాక దాన్నుంచి బయటకు వచ్చేస్తా. యాత్ర 2 తీయాలని 2019లోనే నిర్ణయించుకున్నా. తండ్రీ కొడుకుల కథ చెప్పాలని అనుకున్నా. ఆ కథకు తగ్గట్టుగానే పాత్రలను పెట్టాను. వేరే పాత్రలు లేవు అని అంతా అడుగుతుంటారు. కానీ నా కథకు తగ్గట్టుగానే నేను పాత్రలు పెట్టుకున్నాను. సీఎం వైఎస్ జగన్ గారు ఇంకా సినిమాను చూడలేదు. త్వరలోనే చూస్తారు. నంద్యాల బై ఎలక్షన్ సీన్ తీశాను. కానీ ఎడిటింగ్‌లో తీసేశాను. సినిమా విడుదలై ఒక్క రోజే అయింది. సినిమా విడుదల రోజే మేం థియేటర్లకు వెళ్తే రియాల్టీ తెలియదు. సోమవారం నుంచి రియల్ టాక్ తెలుస్తుంది. థియేటర్లో మ్యూజిక్, విజువల్స్, డైలాగ్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. నాకు వీలైనంతగా సినిమాను ప్రమోట్ చేసేందుకు ప్రయత్నిస్తా. మీడియా కూడా సహకరించాలి. త్వరలోనే సేవ్ ది టైగర్స్ 2 రాబోతోంది. నేను ఓ కథను రాయడానికే టైం పడుతుంది. మెల్లిగానే సినిమాలు చేస్తాను. ప్రస్తుతం కొంత బ్రేక్ తీసుకుని సినిమాలు చేయాలని అనుకుంటున్నా’ అని అన్నారు.


Share this article :