The Mesmerizing Melody Paravasame from Maruva Tarama is Out Now

మరువ తరమా నుంచి ‘పరవశవమే’ మెలోడీ పాట విడుదల



ఫీల్ గుడ్ లవ్ స్టోరీస్‌కు ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. యూత్ ఆడియెన్స్ అంతా కూడా లవ్ స్టోరీలను ఎక్కువగా చూసేందుకు ఇష్టపడుతుంటారు. ఇక ఇప్పుడు అలాంటి ఓ ఫీల్ గుడ్ మ్యూజికల్ లవ్ స్టోరీ 'మరువ తరమా'  రాబోతోంది. అద్వైత్ ధనుంజయ  హీరోగా  అతుల్యా చంద్ర, అవంతిక నల్వా హీరోయిన్లుగా ఈ సినిమా తెరకెక్కుతోంది. సిల్వర్ స్క్రీన్ పిక్చర్స్ బ్యానర్ మీద గిడుతూరి రమణ మూర్తి, రుద్రరాజు విజయ్ కుమార్ రాజు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రానికి చైతన్య వర్మ నడింపల్లి దర్శకత్వం వహించారు. 


ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలా ఓ వైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చేస్తూనే సినిమా ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ఓ మంచి మెలోడీ పాటను విడుదల చేశారు. పరవశమే అంటూ సాగే ఈ పాట శ్రోతలకు ఎంతో వినసొంపుగా ఉంటుంది. విజయ్ బుల్గానిన్ బాణీ ఎంతో శ్రావ్యంగా ఉంది. చైతన్య వర్మ సాహిత్యం, గౌతమ్ భరద్వాజ్ గాత్రం ఈ పాటను మళ్లీ మళ్లీ వినాలనిపించేలా చేస్తున్నాయి.


ఈ చిత్రానికి రుద్ర సాయి కెమెరామెన్‌గా, కె.ఎస్.ఆర్ ఎడిటర్‌గా వ్యవహరించారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన విడుదల తేదీని ప్రకటించనున్నారు.


నటీనటులు : అద్వైత్ ధనుంజయ, అతుల్యా చంద్ర, అవంతిక నల్వా తదితరులు


సాంకేతిక బృందం

నిర్మాతలు : గిడుతూరి రమణ మూర్తి, రుద్రరాజు విజయ్ కుమార్ రాజు

బ్యానర్ : సిల్వర్ స్క్రీన్ పిక్చర్స్

దర్శకత్వం : చైతన్య వర్మ నడింపల్లి

ఎడిటర్ : కె.ఎస్.ఆర్

కెమెరామెన్ :  రుద్ర సాయి 

సంగీతం : విజయ్ బుల్గనిన్

కొరియోగ్రఫర్ : అజయ్ శివ శంకర్

పీఆర్వో : సాయి సతీష్, రాంబాబు 

Post a Comment

Previous Post Next Post