Chellammavey lyrical song from Vijay Antony's "LOVE GURU" is out now

విజయ్ ఆంటోనీ "లవ్ గురు" మూవీ నుంచి 'చెల్లెమ్మవే..' లిరికల్ సాంగ్ రిలీజ్




వైవిధ్యమైన కాన్సెప్ట్ మూవీస్ చేస్తూ సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో హీరోగా ఓ ప్రత్యేకత తెచ్చుకున్నారు విజయ్ ఆంటోనీ.  తన ప్రతి సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు ఈ టాలెంటెడ్ హీరో. విజయ్ ఆంటోనీ తొలిసారి రొమాంటిక్ ఎంటర్ టైనర్ జానర్ లో నటిస్తున్న రోమియో మూవీ తెలుగులో "లవ్ గురు" పేరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో మృణాళిని రవి హీరోయిన్ గా నటిస్తోంది. "లవ్ గురు" సినిమాను విజయ్ ఆంటోనీ ఫిలిం కార్పొరేషన్ బ్యానర్ పై మీరా విజయ్ ఆంటోనీ సమర్పణలో విజయ్ ఆంటోనీ నిర్మిస్తున్నారు. వినాయక్ వైద్యనాథన్ దర్శకత్వం వహిస్తున్నారు.


ఇవాళ ఈ సినిమా నుంచి 'చెల్లెమ్మవే..' అనే సిస్టర్ సెంటిమెంట్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ పాటకు భాష్యశ్రీ లిరిక్స్ అందించారు. భరత్ ధనశేఖర్ సంగీతాన్ని అందించగా..ఆదిత్య ఆర్కే పాాడారు. 'చెల్లెమ్మవే చెయ్యి పట్టుకోవే..నా చెల్లివే..నువు నా చెల్లివే..నేనున్నదే నీ కోసమే..విధి రాసెనే, ఒక రాతనే...ఆ ఆటలో ఎద కృంగెనే..' అంటూ హీరో తన సోదరిని తల్చుకుంటూ చిన్ననాటి జ్ఞాపకాలతో ఎమోషనల్ గా సాగుతుందీ పాట. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న "లవ్ గురు" సినిమాలో హార్ట్ టచింగ్ సెంటిమెంట్ కూడా ఉంటుందని ఈ పాటతో తెలుస్తోంది. "లవ్ గురు" సినిమాను సమ్మర్ లో విడుదల చేయబోతున్నారు. విజయ్ ఆంటోనీ ఈ సినిమాతో మరింతగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు.



నటీనటులు - విజయ్ ఆంటోనీ, మృణాళినీ రవి, వీటీవీ గణేష్, తలైవాసల్ విజయ్, ఇళవరసు, సుధ, శ్రీజ రవి తదితరులు



టెక్నికల్ టీమ్


సినిమాటోగ్రఫీ - ఫరూక్ జే బాష

సంగీతం -భరత్ ధనశేఖర్

ఎడిటింగ్, నిర్మాత - విజయ్ ఆంటోనీ

బ్యానర్ - విజయ్ ఆంటోనీ ఫిలిం కార్పొరేషన్

సమర్పణ - మీరా విజయ్ ఆంటోనీ

పీఆర్ ఓ - జీఎస్ కే మీడియా

రచన దర్శకత్వం - వినాయక్ వైద్యనాథన్ 

Post a Comment

Previous Post Next Post