Home » » TFCC chairman Pratani Ramakrishna Goud Launched Akkadavaru Ikkada Vunnaru Poster

TFCC chairman Pratani Ramakrishna Goud Launched Akkadavaru Ikkada Vunnaru Poster

టి ఎఫ్ సి సి చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ గారి చేతుల మీదగా అక్కడ వారు ఇక్కడ ఉన్నారు సినిమా పోస్టర్ లాంచ్



త్రివిక్రమ రావు కుందుర్తి నిర్మిస్తూ, దర్శకత్వం వహించిన అక్కడ వారు ఇక్కడ ఉన్నారు మూవీ పోస్టర్ లాంచ్ నేడు ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్లో ముఖ్యఅతిథిగా టి ఎఫ్ సి సి చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ గారు, తెలంగాణ ఫిలిం ఛాంబర్ వైస్ చైర్మన్ గురు రాజ్ గారు, ఈ సినిమా నిర్మాత దర్శకుడు త్రివిక్రమ రావు కుందుర్తి గారు మరియు ఈ సినిమాలో నటించిన నటీనటులు, సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా టి ఎఫ్ సి సి చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ గారు మాట్లాడుతూ : అక్కడ వారు ఇక్కడ ఉన్నారు టైటిల్, పోస్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. త్రివిక్రమ రావు గారు మొదటి సినిమా అయిన ఇంతమంది ఆర్టిస్టులతో పనిచేయించుకోవడం గొప్ప విషయం. ఈరోజు ఇంతమంది ఆర్టిస్టులను సన్మానించుకోవడం చాలా మంచి విషయం. సినిమనే లోకం సినిమానే ప్రపంచం అనుకునే వ్యక్తి త్రివిక్రమ రావు గారు. ఎప్పుడు కలిసిన సినిమా గురించే మాట్లాడుతారు. అలాంటి వ్యక్తి తీసిన సినిమా ఇది. ఈ సినిమా సక్సెస్ అయితే ఇంకొంతమంది టెక్నీషియన్స్ ఇంకొన్ని మంచి సినిమాలు మన ముందుకు వస్తాయి. ఈ సినిమా ఈ టీం కి మంచి సక్సెస్ అవ్వాలని మీ ఆదరణ ఆశీస్సులు ఇలా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజున చిన్న సినిమాలే పెద్ద విజయాన్ని సాధిస్తున్నాయి ఈ సినిమా కూడా అలాగే మంచి విజయం సాధిస్తుంది అని నమ్మకం ఉంది అన్నారు.


తెలంగాణ ఫిలిం ఛాంబర్ వైస్ చైర్మన్ గురు రాజ్ గారు మాట్లాడుతూ : అక్కడ వారు ఇక్కడ ఉన్నారు పోస్టర్ లాంచ్ కి వచ్చిన టి ఎఫ్ సి సి చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ సినిమాకి దర్శకత్వం వహించిన త్రివిక్రమ రావు ఈ సినిమా సక్సెస్ తో త్రివిక్రమ్ 2 గా ఎదగాలని కోరుకుంటున్నాను. త్రివిక్రమ్ కూడా చిన్న సినిమాలు నుంచి మొదలుపెట్టి ఈ రోజున తెలుగు సినిమాని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి ఈ త్రివిక్రమ రావు కూడా త్రివిక్రమ్ 2 గా గుర్తింపు తెచ్చుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. చిన్న సినిమాలు నిర్మించి ఫెయిల్ అయితే ఆ దర్శకుడు నిర్మాత కనబడరు అలాంటి వారిని కూడా గుర్తించి సన్మానించడం అనేది త్రివిక్రమ్ 2కి చాలా గొప్ప విషయంగా భావిస్తున్నాను. చిన్న సినిమాలు రావాలి మంచి విజయాలు సాధించాలి. ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని మీ ఆదరణ ఆశీస్సులు ఈ సినిమాపై ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.


దర్శకుడు త్రివిక్రమ రావు కుందుర్తి మాట్లాడుతూ : నేను దర్శకత్వం వహించిన అక్కడ వారు ఇక్కడ ఉన్నారు పోస్టర్ లాంచ్ కి వచ్చిన టి ఎఫ్ సి సి చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ గారికి అలాగే వైస్ చైర్మన్ గురు రాజ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అడగగానే ఈవెంట్ కి వచ్చి నా టీం ని సపోర్ట్ చేసినందుకు వారి చేతుల మీదుగా నా టీం ని సన్మానించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. నేను సినిమా చేస్తే వారు సపోర్ట్ ఇస్తాను అన్నారు అన్నమాట ప్రకారం ఈ రోజున ఈ ఈవెంట్ కు రావడం చాలా ఆనందంగా ఉంది. ఇలాగే ముందు ముందు ఇంకా మంచి సినిమాలు తో ఫ్యామిలీ అందరూ కలిసి చూస్తే సినిమాలు నిర్మిస్తాను వాటికి కూడా మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో నటించిన నటీనటులు కొత్తవారైనా చాలా అనుభవం ఉన్నవాళ్లలా నటించారు అలాగే నా టెక్నీషియన్స్ మ్యూజిక్ ఎడిటింగ్ అన్ని చాలా బాగా కుదిరాయి. ఈ సినిమా సక్సెస్ అవ్వాలని ప్రేక్షకుల ప్రేమ అభిమానం ఆశీస్సులు ఎప్పుడూ నాపై మా టీం పై ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.


టెక్నీషియన్స్ :

నిర్మాణ సంస్థ : సాయి విజ్కి సినిమా

మ్యూజిక్ : శ్రీ వెంకట్

డిఓపి : రాజు కేశన్న

ఎడిటర్ : వెంకట్

ఆర్ట్ : సూరి

అసిస్టెంట్ డైరెక్టర్స్ : వికాస్ & సూరి

కో డైరెక్టర్ : గణేష్

నిర్మాత మరియు దర్శకుడు : త్రివిక్రమరావు కుందుర్తి

డిజిటల్ : నరేష్ & సునీల్

పిఆర్ఓ : యశ్వంత్


Share this article :