Mr Bachchan Valentine's Day Special Poster Unveiled

 మాస్ మహారాజా రవితేజ, భాగ్యశ్రీ బోర్సే, హరీష్ శంకర్, టిజి విశ్వ ప్రసాద్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ 'మిస్టర్ బచ్చన్' నుంచి వాలెంటైన్స్ డే స్పెషల్ పోస్టర్



మాస్ మహారాజా రవితేజ, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్‌ దర్శకత్వంలో చేస్తున్న 'మిస్టర్ బచ్చన్‌'లో ఇంటెన్స్ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నారు. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే తో అందమైన లవ్ ట్రాక్ ఉంటుంది. వాలెంటైన్స్ డే  సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, మేకర్స్ రవితేజ, భాగ్యశ్రీ  ఒకరినొకరు ఆప్యాయంగా కౌగిలించుకున్నట్లు చూపించే రొమాంటిక్ పోస్టర్‌ను విడుదల చేశారు.


ఈ మ్యాజికల్ మాస్ కాంబోలో రూపొందిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై  ప్రముఖ నిర్మాత టిజి విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.


ఇటివలే చిత్ర యూనిట్ కారంపూడిలో షూటింగ్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సంబధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి.


'నామ్ తో సునా హోగా' అనే ట్యాగ్‌లైన్‌ తో రూపొందుతున్న ఈ చిత్రానికి  మిక్కీ జె మేయర్ సంగీతం అందించగా, అయనంక బోస్ డీవోపీగా చేస్తున్నారు. ఈ చిత్రానికి అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ కాగా, ఎడిటింగ్ ఉజ్వల్ కులకర్ణి.


తారాగణం: రవితేజ, భాగ్యశ్రీ బోర్సే


సాంకేతిక విభాగం:

రచన, దర్శకత్వం: హరీష్ శంకర్

నిర్మాత: టీజీ విశ్వ ప్రసాద్

సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల

బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ

సమర్పణ: పనోరమా స్టూడియోస్ & T-సిరీస్

సంగీతం: మిక్కీ జె మేయర్

డీవోపీ: అయనంక బోస్

ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా

ఎడిటింగ్: ఉజ్వల్ కులకర్ణి

పీఆర్వో: వంశీ-శేఖర్

మార్కెటింగ్: ఫస్ట్ షో

మేకప్ చీఫ్: ఐ శ్రీనివాసరాజు

Post a Comment

Previous Post Next Post