Home » » Actor Thrigun's Telugu-Kannada Bilingual captivating first look and motion poster out now, releasing worldwide on March 15th

Actor Thrigun's Telugu-Kannada Bilingual captivating first look and motion poster out now, releasing worldwide on March 15th

 వెర్సటైల్ యాక్టర్ త్రిగుణ్ తెలుగు, కన్నడ బై లింగ్వువల్ మూవీ ‘లైన్ మ్యాన్’ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ విడుదల  .. మార్చి 15న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్



తెలుగు, తమిళ సినిమాల్లో విభిన్నమైన సినిమాలు చేస్తూ తనదైన ప్రత్యేకతను సంపాదించుకున్న హీరో త్రిగుణ్. ఇప్పుడు ఆయన కన్నడ సినీ ఇండస్ట్రీలోనూ గ్రాండ్ ఎంట్రీ ఇవ్వటానికి సిద్ధమయ్యారు. ఆ సినిమాయే ‘లైన్ మ్యాన్’. వి.రఘుశాస్త్రి దర్శకత్వంలో తెరకెక్కతోన్న ఈ సినిమాను కన్నడ, తెలుగు భాషల్లో విడుదలకు సిద్ధమవుతుండటం విశేషం. మాండ్య ప్రాంతంలోని సమీప గ్రామాల్లోనిఅక్కడి వాతావరణాన్ని చక్కగా ఆవిష్కరిస్తూ కామెడీ ప్రధానంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.


ఈ క్రమంలో ‘లైన్ మ్యాన్’ మూవీకి సంబంధించి ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌ను మేకర్స్ సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. దీనికి ప్రేక్షకుల నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ప్రమోషనల్ కంటెంట్ అందరిలోనూ ఆసక్తిని మరింతగా పెంచింది. ఓ లైన్ మ్యాన్ జీవితంలోని ముఖ్యమైన, ఆసక్తికరమైన అంశాలను ఇందులో ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌ను గమనిస్తే రెండు కరెంట్ స్తంభాలతో క్రియేటివ్‌గా డిజైన్ చేయబడింది. ఇక లైన్ మ్యాన్ ఈ స్తంభాలను ఎక్కడానికి ప్రధానంగా ఉపయోగించే నిచ్చెనను మన కథానాయకుడు త్రిగుణ్ పట్టుకుని ఉన్నారు. అలాగే సినిమాలోని ఇతర పాత్రలను కూడా ఈ పోస్టర్‌లో మనం గమనించవచ్చు. వీరి జీవితాలకు, లైన్ మ్యాన్ జీవితానికి ఉన్న సంబంధం ఏంటనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే మరి.


‘లైన్ మ్యాన్’ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌తో ఇందులో ఎంటర్‌టైన్‌మెంట్ సహా ఇతర ప్రధానాంశాలు ఎలా ఉంటాయో చూడాలనే ఆసక్తి అందరిలోనూ పెరిగింది. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, కన్నడ భాషల్లో మార్చి 15న గ్రాండ్ రిలీజ్ చేయటానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాతో త్రిగుణ్ కన్నడ సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టటమే కాకుండా, ఇలాంటి కథాంశంతో సినిమా చేయటం ద్వారా ప్రాంతీయత భావనను అందరిలోనూ తొలగించి భాషా పరమైన అడ్డంకులను అధిగమించవచ్చనని తెలియజేయటానికి ఇదొక నిదర్శనంగా చెప్పొచ్చు. సినిమాపై ఆసక్తిని పెరగటం అనేది మంచి పరిణామంగా మేకర్స్ భావిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా మ్యాండ ప్రాంతంలోని లైన్ మ్యాన్ జీవితాన్ని మనకు చూపించే ప్రయత్నం చేస్తున్నారు.


ఈ చిత్రంలో ఇంకా కాజల్ కుందెర్, బి.జయశ్రీ, నివిక్ష నాయుడు, హరిణి శ్రీకాంత్, సుజయ్ శాస్త్రి, అపూర్వ శ్రీ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ప్రెస్టీజియస్ పర్పల్ రాక్ ఎంటర్‌టైనర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ చిత్రానికి ప్రచూర.పి, కాద్రి మణికాంత్, జ్యోతి రఘుశాస్త్రి, భళా స్టూడియో సహ నిర్మాతలు వ్యవహరిస్తున్నారు. శాంతి సాగర్ హెచ్.జి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, రఘునాథ ఎడిటర్‌ వర్క్ చేస్తున్నారు. కాద్రి మణికాంత్ సంగీత సారథ్యం వహిస్తున్నారు.


నటీనటులు: త్రిగుణ్, కాజల్ కుందెర్, బి.జయశ్రీ, నివిక్ష నాయుడు, హరిణి శ్రీకాంత్, సుజయ్ శాస్త్రి, అపూర్వ శ్రీ, మైకో నాగరాజ్, చేతన్ గంధర్వ, దిలీప్ కుమార్, సందీప్ కెంపగౌడ, శ్రీదత్త, సమర్థ్ నర్సింహులు, సుహైల్ రసూల్, గౌరవ్ శెట్టి తదితరులు


సాంకేతిక వర్గం:


రచన, దర్శకత్వం - వి.రఘు శాస్త్రి

నిర్మాణం - పర్పల్ రాక్ ఎంటర్‌టైనర్స్

సహ నిర్మాతలు - ప్రచూర.పి, కాద్రి మణికాంత్, జ్యోతి రఘు శాస్త్రి, భళా స్టూడియోస్

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - గణేష్ పాపన్న

సినిమాటోగ్రపీ - శాంతి సాగర్ హెచ్.జి

ఎడిటర్ - రఘునాథ.ఎల్

మ్యూజిక్ - కాద్రి మణికాంత్

ఆర్ట్ - సూర్య గౌడ

పి.ఆర్.ఒ - వంశీ కాకా, హరీష్ అరసు

పబ్లిసిటీ డిజైన్స్ - రాజ్సో క్రియేటివ్స్

లేబుల్ - సారిగమ ఇండియా లిమిటెడ్, ఏ ఆర్.పి.ఎస్.జి గ్రూప్ కంపెనీ



Share this article :