Roti Kapada Romance Releasing on March 22nd

మార్చి 22న రోటి  క‌ప‌డా రొమాన్స్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల



‘హుషారు, సినిమా చూపిస్త మావ, మేం వయసుకు వచ్చాం, ప్రేమ ఇష్క్ కాదల్, పాగల్’ వంటి యూత్ ఫుల్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత, లక్కీ మీడియా అధినేత బెక్కెం వేణుగోపాల్.. సృజన్‌ కుమార్ బొజ్జంతో కలిసి నిర్మించిన చిత్రం ‘రోటి కపడా రొమాన్స్’. హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువ్వేక్ష, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి విక్రమ్ రెడ్డి దర్శకుడు. ఇటీవ‌ల విడుద‌ల చేసిన  ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ డోస్ (టీజ‌ర్‌)కు అనూహ్య‌మైన స్పంద‌న వ‌చ్చింది.సెకండ్‌డోస్ లో భాగంగా  విడుద‌ల చేసిన ఈ సినిమాలోని అరెరె.. అరెరె అనే లిరిక‌ల్ వీడియోకు మంచి స్పంద‌న  వ‌చ్చింది. తాజాగా ఈ చిత్రం విడుద‌ల తేదిని ప్ర‌క‌టించారు మేక‌ర్స్‌. మార్చి 22న  చిత్రాన్ని ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల చేయాల‌ని నిర్ణ‌యించారు. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు  మాట్లాడుతూ న‌లుగురు స్నేహితుల క‌థ ఇది. వారి స్నేహం, ప్రేమ‌, వారి లైఫ్ జ‌ర్ని ఈ చిత్రంలో చూపిస్తున్నాం. నేటి యువ‌త‌రాన్ని అమితంగా ఆక‌ట్టుకునే ఈ యూత్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్‌లో కుటుంబ ప్రేక్ష‌కుల‌ను అల‌రించే భావోద్వేగాలు కూడా వున్నాయి. అభిరుచి గ‌ల నిర్మాత బెక్కెం వేణుగోపాల్‌తో క‌లిసి  సృజన్‌ కుమార్ బొజ్జం ఈ చిత్రాన్ని ఎక్క‌డా రాజీప‌డ‌కుండా నిర్మించారు.త‌ప్ప‌కుండా ఈ చిత్రం యూత్‌కు ఓ ఫెస్ట్‌లా వుంటుంది* అన్నారు.


హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువ్వేక్ష, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి

ఆర్ట్ డైరెక్టర్: కిరణ్ మామిడి,

కొరియోగ్రఫీ: జేడీ మాస్టర్,

కాస్ట్యూమ్ డిజైనర్: అశ్వంత్‌ భైరి, ప్రతిభా రెడ్డి

అసోసియేట్ ప్రొడ్యూసర్: నాగార్జున వడ్డె,

డీఓపీ: సంతోష్ రెడ్డి,

సంగీతం: హర్ష వర్థన్ రామేశ్వర్, ఆర్ ఆర్ ధ్రువన్, వసంత్.జి

పాటలు: క్రిష్ణ కాంత్, కాసర్ల శ్యామ్, రఘురామ్


ఎడిటర్: విజయ్ వర్థన్

నిర్మాతలు: బెక్కెం వేణుగోపాల్, సృజన్‌ కుమార్ బొజ్జం

కథ, స్కీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: విక్రమ్ రెడ్డి 

Post a Comment

Previous Post Next Post