Home » » Hanu-Man Success Celebrations Held Grandly

Hanu-Man Success Celebrations Held Grandly

'హను-మాన్' అద్భుత విజయం ప్రేక్షకులందరిది: గ్రాటిట్యూడ్ మీట్ లో హను-మాన్ టీంక్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన ఫస్ట్ ఇండియన్ ఒరిజినల్ సూపర్ హీరో మూవీ 'హను-మాన్'. యంగ్ హీరో తేజ సజ్జ కథానాయకుడిగా ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె నిరంజన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా చాలా గ్రాండ్ గా విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అద్భుతంగా అలరించి, రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో ఎపిక్ బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించి, సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ గ్రాటిట్యూడ్ మీట్ ని నిర్వహించింది.    


గ్రాటిట్యూడ్ మీట్ లో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ముందుగా నన్ను ప్రోత్సహించిన అమ్మానాన్నలకు కృతజ్ఞతలు. నిరంజన్ గారు లాంటి నిర్మాత దొరకడం మా అదృష్టం. చాలా గ్రాండ్ గా అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్లడాని సపోర్ట్ చేశారు. నేను తేజ చాలా కాలంగా ప్రయాణిస్తున్నాం. తేజ చాలా మంచి యాక్టర్. చాలా కష్టపడి ఈ సినిమా కోసం పని చేశాడు. తను చాలా పరిణతి గల వ్యక్తి. ఈ సినిమాకి తేజ పర్ఫెక్ట్ యాప్ట్ ని విడుదలకు ముందు చెప్పాను. ఇప్పుడు చూసి ప్రేక్షకులు అదే మాట చెప్పడం ఆనందంగా వుంది. ఈ సినిమాతో తను సూపర్ హీరో అయ్యాడు. ఫ్రండ్ ని హీరో చేయడం ఒక తృప్తి. ఫ్రండ్ ని స్టార్ చేయడం ఇంకా ఆనందాన్ని ఇస్తుంది. తనని ఈ స్థాయిలో చూడటం చాలా సంతోషంగా వుంది. అమృత చాలా చక్కని నటన కనపరిచింది. వరలక్ష్మీ శరత్ కుమార్ గారు సంక్రాంతికి లక్కీ చార్మ్. ఆమెతో వర్క్ చేయడం మంచి అనుభూతి. వినయ్ రాయ్ తన పాత్ర కోసం చాలా హార్డ్ వర్క్ చేశారు. గెటప్ శీను, సత్య, వెన్నెల కిషోర్ గారు, రోహిణీ గారు, రామ్ గారు, రాకేశ్ మాస్టర్ అందరూ చాలా చక్కగా చేశారు. వారి పాత్రలని ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తున్నారు.  మాస్ మహారాజా రవితేజ గారు హనుమాన్ లో భాగం అవ్వడం చాలా ఆనందాన్ని ఇచ్చింది.  కోటి క్యారెక్టర్ కు రవితేజ గారు ఇచ్చిన వాయిస్ ని ప్రేక్షకులు గొప్పగా ఆస్వాదిస్తున్నారు. కోటి పాత్రని ఈ సినిమాటిక్ యూనివర్స్ లో ముందుకు తీసుకెళ్ళే ఒక ఆలోచన వచ్చింది. రవితేజ గారు ఒప్పుకుంటే ఆయనతో ఈ యూనీవర్స్ ఒక సినిమా చేయాలని ఆశిస్తున్నాం. శివేంద్ర గారి వర్క్ చేయడం మంచి అనుభూతి. వండర్ ఫుల్ విజువల్స్ ఇచ్చారు. వీఎఫ్ ఎక్స్ టీమ్స్ కు ధన్యవాదాలు. నాగేంద్ర గారు అద్భుతమైన ప్రొడక్షన్ డిజైన్ చేశారు. కృష్ణ శౌరబ్ సిస్టర్ సెంటిమెంట్ పాటని అద్భుతంగా చేశారు. అనుదీప్ దేవ్, హరి గౌర చాలా హార్డ్ వర్క్ చేసి సినిమా విజయం కోసం పని చేశారు. ఈ సినిమాకి పని చేసిన అందరికీ పేరుపేరున ధన్యవాదాలు. డైరెక్షన్, రైటింగ్ టీంకి థాంక్స్. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యునివర్స్ లో ట్యాలెంటెడ్ డైరెక్టర్స్ పరిచయం చేయాలనేది మా ఉద్దేశం. ఫిల్మ్ మేకింగ్ చాలా కష్టమైన పని. ఒక విజయం చాలా మంది జీవితాలకు ఫుడ్ పెడుతుంది. ఎన్నో క్లోజింగ్ థియేటర్స్ ఈ సినిమా వలన ఓపెన్ అయ్యాయని చెప్పడం గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. మూడో వారంలో కూడా హౌస్ ఫుల్ బోర్డ్ చూడటం ఒక ఫిలిం మేకర్ కి గొప్ప తృప్తిని ఇస్తుంది. మా టీం హార్డ్ వర్క్ తో పాటు హనుమంతుల వారి ఆశీస్సులు ఈ చిత్రంపై వున్నాయి. మైత్రీ డిస్ట్రిబ్యూటర్స్ కి థాంక్స్. హనుమాన్ కి సంబధించి చాలా వేడుకలు ఉండబోతున్నాయి. యాభై రోజుల వేడుకలో సినిమాకి పని చేసిన అందరికీ గిఫ్ట్స్ వుండబోతున్నాయి. ప్రేక్షకులు హనుమాన్ సినిమాని ఒక దేవాలయంగా ఫీలౌతున్నారు. ప్రేక్షకులకు తెలియకుండానే సినిమా చూస్తున్న ప్రతి ఒక్కరూ అయోధ్య రామమందిరానికి ఐదు రూపాయిలు డొనేట్ చేస్తున్నారు. ఇది నిర్మాత నిరంజన్ గారి వలనే సాధ్యపడింది. అయోధ్యతో పాటు మిగతా ఆలయాలకు కూడా ఇవ్వడానికి ఆయన సిద్ధంగా వున్నారు. ఈ సినిమా నుంచి వస్తున్న లాభాలు దేవులవారికి, సినిమాలు తీయడానికే ఖర్చుపెడతాం. హనుమాన్ ఇంకా చాలా రోజులు ఆడుతుంది. ఈ సినిమాలో పని చేసిన 24 విభాగాల వారికీ పేరుపేరునా ధన్యవాదాలు. మాకు ఎంతగానో ప్రోత్సహించిన మీడియాకు ధన్యవాదాలు. ఈ సినిమా విజయానికి కారణమైన అందరికీ ధన్యవాదాలు. సినిమాని వెన్నుముకలా నడిపించిన హనుమంతుల వారికీ రాముల వారికి ప్రేక్షకులకు ఈ విజయాన్ని ఆపాదిస్తున్నాను. మీ అందరి ఋణం జై హనుమాన్ తో తీర్చుకోబోతున్నాను, జై హనుమాన్ .. హను మాన్ కి వందరెట్లు ఉండబోతుంది. ఇంటర్ నేషనల్ సినిమా చేయడానికి ప్రయత్నిస్తున్నాం. వీలైనంత త్వరగా ఆ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాం. ఫ్యామిలీ ఆడియన్స్ అంతా థియేటర్స్ కి వచ్చి చూసే సినిమాలే చాలా భాద్యతగా తీస్తాను. ఈ సినిమాకి వచ్చిన రెస్పాన్స్ చూసిన తర్వాత కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ఇది నాపై ఇంకా భాద్యత పెంచింది. మంచి సినిమాలు తీసి పరిశ్రమ మేలుకు నా వంతు కృషి చేస్తాను. జై శ్రీరామ్.. జై హనుమాన్’ అన్నారు.  


హీరో తేజ సజ్జా మాట్లాడుతూ.. ముందుగా మా మెగాస్టార్ ‘పద్మ విభూషణ్’ చిరంజీవి గారికి అభినందనలు. ఈ సినిమా కోసం టీం అంతా సమిష్టిగా కృషి చేశారు. డీవోపీ, మ్యూజిక్, ఆర్ట్ డిపార్ట్ మెంట్, ఎడిటింగ్, వీఎఫ్ఎక్స్.. ఇలా అన్నీ విభాగాలు చాలా కష్టపడి అద్భుతమైన ఒట పుట్ ఇచ్చారు.  వరలక్ష్మీ గారు ఈ సినిమాలో భాగం కావడం ఆనందంగా వుంది. అమృత చాలా చాలా అద్భుతంగా తన పాత్రని చేశారు. గెటప్ శ్రీను, సత్య, వెన్నెల కిషోర్ ఇలా నటీనటులంతా చక్కని అభినయం కనపరిచారు. ఈ సినిమా కోసం పని చేసిన ప్రతి విభాగానికి పేరుపేరునా ధన్యవాదాలు.   నిర్మాత నిరంజన్ గారు ఈ సినిమా వెనుక కొండంత అండగా నిలబడ్డారు. మమ్మల్ని బలంగా నమ్మారు. సినిమాని ఇంత అద్భుతంగా విడుదల చేసిన పంపిణీదారులందరికీ ధన్యవాదాలు. హను-మాన్ ని క్రియేట్ చేసిన దర్శకుడు ప్రశాంత్ వర్మకి ధన్యవాదాలు. ప్రేక్షకులు మా వెనుక నిలబడ్డారు కాబట్టే మేము ఈ రోజు ఈ వేదికపై వున్నాం. సినిమాని అద్భుతంగా ప్రోత్సహించిన ప్రేక్షకులకు పాధాబివందనం. ఇకపై చేసే చిత్రాలు కూడా ఇంతే కష్టపడి ప్రేక్షకులకు నచ్చేలా చేస్తాం. హనుమాన్ అనే సినిమా అద్భుతం. ఆ అద్భుతంగా జరిగిపోయింది. అందరికీ పేరుపేరున ధన్యవాదాలు’’ తెలిపారు.


హీరోయిన్ అమృత అయ్యర్ మాట్లాడుతూ.. హనుమాన్ లో భాగం కావడం చాలా గర్వంగా ఎమోషనల్ గా వుంది. అందరూ హనుమాన్ మీనాక్షి అంటున్నారు. దర్శకుడు ప్రశాంత్ గారికి ధన్యవాదాలు. వెండితెరపై అద్భుతంగా చూపించారు. తేజ తో వర్క్ చేయడం చాలా మంచి అనుభూతి. నిర్మాత నిరంజన్ గారికి థాంక్స్. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఇంత గొప్ప విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు.’’ తెలిపారు.


వరలక్ష్మీ శరత్ కుమార్ మాట్లాడుతూ.. హనుమాన్ లో ఎలా అయితే హనుమాన్, మాన్ వున్నారో ఇక్కడ తేజ, ప్రశాంత్ వున్నారు. ఇంత విజయాన్ని అందుకున్న వారికి ముందుకు అభినందనలు.. నిర్మాతలు దర్శకుడి విజన్ ని అద్భుతంగా సపోర్ట్ చేశారు.  ఈ సినిమాకి పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఈ సినిమాలో భాగం కావడం చాలా ఆనందంగా వుంది. ఇంత పెద్ద విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు’’ తెలిపారు.


నిర్మాత నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. అద్భుతమైన విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. నేను, దర్శకుడు ప్రశాంత్ వర్మ ఏదైతే నమ్మి మూడేళ్ళుగా హార్డ్ వర్క్ చేశామో.. ప్రేక్షకులకు ఆదరణతో ఈ రోజు అది సాధించామని భావిస్తున్నాం. అమృత, వరలక్ష్మీ.. మా టీం అందరికీ ధన్యవాదాలు. ఈ విజయం సమిష్టి కృషి. ఈ సినిమాకి తేజ పర్ఫెక్ట్ అని ఆడియన్స్ నిరూపించారు. తేజ లేకపోతే ఈ సినిమా లేదు. చాలా అంకిత భావంతో పని చేశారు. ప్రశాంత్ బలం తనకి తెలీదు. హనుమాన్ లో చూసింది కేవలం ఒక్క శాతమే. ఇంకా 99 శాతం బయటికి రావాలి. దాన్ని ఎచీవ్ చేస్తారని భావిస్తున్నాను. ఆయన విజన్ తెరపైకి తీసుకురావడానికి మొదటి వ్యక్తి నేను కావడం ఆనందంగా వుంది. తన విజన్ ని బౌండరీలు లేవు. అది ఈ రోజు ఆడియన్స్ ప్రూవ్ చేశారు. డిస్ట్రిబ్యుటర్స్ అందరికీ ధన్యవాదాలు. ఇంత పెద్ద విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ తెలిపారు.  


నిర్మాత చైతన్య మాట్లాడుతూ.. ఆ దేవుడు మాకిచ్చిన అనుగ్రహం ప్రశాంత్ ఈ చిత్రాన్ని మా వద్దకు తీసుకురావడం. ప్రేక్షకుల నుంచి వస్తున్న ఆదరణ చూస్తుంటే అనందంతో కన్నీళ్లు వస్తున్నాయి. దేవుడికి, ప్రేక్షకులకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇన్ని కోట్ల మంది ప్రేమ ఆదరణ వస్తుందని జీవితంలో ఏనాడూ అనుకోలేదు. ఇదంతా ప్రేక్షకులు, దేవుడు మాకిచ్చిన అదృష్టం. ఈ విజయం మన అందరిదీ. ఇప్పుడు మా బాధ్యత పెరిగింది. కోట్లమంది మాకు స్నేహితులు వచ్చారు. మీ అందరూ మళ్ళీ ఆదరించేలా మీ ముందుకు వచ్చే ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటున్నాం. అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు’’ తెలిపారు. చిత్ర యూనిట్ సభ్యులంతా పాల్గొన్న ఈ వేడుక గ్రాండ్ గా జరిగింది.


Share this article :