Home » » Dil Raju and Naga Vamsi Shared Their Happiness on Guntur Kaaram Success

Dil Raju and Naga Vamsi Shared Their Happiness on Guntur Kaaram Success

 ఫ్యామిలీ ఎమోషన్స్‌తో రూపొందిన ‘గుంటూరుకారం’ సినిమాను ఫ్యామిలీతో సహా ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తున్నారు: దిల్ రాజు



సూపర్ స్టార్ మహేష్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ(చినబాబు) ప్రతిష్టాత్మకంగా నిర్మించిన భారీ చిత్రం ‘గుంటూరు కారం’ . శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటించారు. హై ఎక్స్‌పెక్టేషన్స్ నడుమ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ చిత్రం తొలి రోజున రూ.94 కోట్ల వసూళ్లను సాధించింది రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సందర్బంగా శనివారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో...


నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ ‘‘‘గుంటూరు కారం’ సినిమా సంక్రాంతికి జనవరి 12న రిలీజైంది. మేం ఊహించిన దాని కంటే గొప్ప రెస్పాన్స్ రావటం చాలా సంతోషంగా ఉంది. కలెక్షన్స్ చాలా బాగా వచ్చాయి. చాలా రోజుల తర్వాత ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఉన్న సినిమా రీజనల్ తెలుగు సినిమా వచ్చింది. ప్రేక్షకులు ఎంకరేజ్ చేస్తున్నారు. కొన్ని చోట్ల మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ ఈవినింగ్ షోస్ కంతా ఆ టాక్ అంతా సమసిపోయింది. చక్కగా ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేసే పండుగ సినిమా. కుటుంబంతో వచ్చి మహేష్, త్రివిక్రమ్ గారి సినిమాను ఎంజాయ్ చేయండి. పాటలు, ఫైట్స్, సెంటిమెంట్ సహా అన్నీ ఎలిమెంట్స్ ఉన్న ఫెస్టివల్ మూవీ. అందరూ ఎంటర్‌టైన్‌మెంట్ అవుతారనే గ్యారంటీ మాది’’ అన్నారు. 


నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ ‘‘అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. రాత్రి ఒంటి గంట షోస్ మిక్స్ డ్ టాక్ వచ్చింది. నేను క్రాస్ చెక్ చేసుకోవటానికి సుదర్శన్ థియేటర్ కి వెళ్లి సినిమా చూశాను. మహేష్ బాబుగారి క్యారెక్టర్ ను బేస్ చేసుకుని చేసిన సినిమా ‘గుంటూరు కారం’. తల్లీ, కొడుకు మధ్య ఉండే ఫ్యామిలీ ఎమోషనల్ మూవీ. కుటుంబం అంతా కలిసి చూసి ఎంజాయ్ చేసే సినిమా ఇది. క్లైమాక్స్ లో వచ్చే ఎమోషన్. చివరలో వచ్చే మాస్ సాంగ్ ఇలా అన్నింటిని ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. పండుగ తర్వాత సినిమా ఎంత కలెక్ట్ చేసిందనేది తెలుస్తోంది. మరో నాలుగు రోజులు పండుగ ఉంటుంది. బాగుండే సినిమాను ఎవరూ ఆపలేరు. అది చరిత్ర. ప్రతి ఏడాది సంక్రాంతికి నిర్మాతల మధ్య చిన్న పాటి వార్స్ అనేవి జరుగుతుంటాయి. ఇది వ్యాపారం. ఎఇక్కడ బిజినెస్ చాలెంజెస్ మాత్రమే ఉంటాయి.వరికీ ఎవరూ శత్రువులు లేరు’’ అన్నారు.



Share this article :