Home » » Seesa Mootha Ippu Lyrical Out Now From Naa Saami Ranga

Seesa Mootha Ippu Lyrical Out Now From Naa Saami Ranga

 కింగ్ నాగార్జున అక్కినేని, విజయ్ బిన్ని, శ్రీనివాస చిట్టూరి, శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ 'నా సామిరంగ " నుంచి సీసా మూత ఇప్పు పాట విడుదల



కింగ్ నాగార్జున అక్కినేని హోల్సమ్ ఎంటర్‌టైనర్ ‘నా సామిరంగ’. ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం అందరినీ ఆకట్టుకునే ప్రమోషనల్ కంటెన్ తో హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేసింది. పోస్టర్‌లు, టీజర్, ట్రైలర్ కు  ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.


ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి అందించిన పాటలు చార్ట్ బస్టర్ గా అలరిస్తున్నాయి. తాజాగా మేకర్స్ ఈ చిత్రం నుంచి 'సీసా మూత ఇప్పు' పాటని విడుదల చేశారు. కీరవాణి ఈ పాటని పుట్ ట్యాపింగ్ నెంబర్ గా కంపోజ్ చేశారు. ఆస్కార్ లిరిసిస్ట్ చంద్రబోస్ అందించిన లిరిక్స్ మాస్ ని అలరించేలా వున్నాయి.


మల్లికార్జున్, రేవంత్, సాయిచరణ్, లోకేష్, హైమత్,  అరుణ్ కౌండియా కలసి ఈ పాటని చాలా హుషారుగా ఆలపించారు. ఈ పాటలో నాగార్జున డ్యాన్స్ మూమెంట్స్ మాస్ ని కట్టి పడేస్తున్నాయి. నాగార్జునతో అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కలసి డ్యాన్స్ చేయడం ప్రేక్షకులకు కన్నుల పండగలా వుంది. ఈ పాటకు థియేటర్స్ దద్దరిల్లిపోవడం ఖాయం.  


మంచి ప్రేమకథ, స్నేహం, భావోద్వేగాలు, మాస్, యాక్షన్ ఎలిమెంట్స్ కూడిన 'నా సామిరంగ' సంక్రాంతికి పర్ఫెక్ట్ మూవీ.    


ఈ చిత్రంలో నాగార్జున సరసన ఆశికా రంగనాథ్ కథానాయికగా నటిస్తోంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌పై శ్రీనివాస చిట్టూరి హై బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పిస్తున్నారు.


బ్లాక్ బస్టర్ రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ ఈ చిత్రానికి కథ, మాటలు అందించారు.


నా సామిరంగ జనవరి14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ విడుదల కానుంది.  


తారాగణం: కింగ్ నాగార్జున అక్కినేని, అల్లరి నరేష్, ఆషికా రంగనాథ్, రాజ్ తరుణ్


సాంకేతిక విభాగం:

దర్శకత్వం: విజయ్ బిన్ని

నిర్మాత: శ్రీనివాస చిట్టూరి

బ్యానర్: శ్రీనివాస సిల్వర్ స్క్రీన్

సంగీతం: ఎంఎం కీరవాణి

డీవోపీ: శివేంద్ర దాశరధి

సమర్పణ: పవన్ కుమార్

కథ, మాటలు: ప్రసన్న కుమార్ బెజవాడ

సాహిత్యం: చంద్రబోస్

పీఆర్వో: వంశీ-శేఖర్




Share this article :