Home » » Tollywood GAAMA Awards in Dubai on March 3rd

Tollywood GAAMA Awards in Dubai on March 3rd

దుబాయ్‌లో మార్చ్ 3న గామా టాలివుడ్ మూవీ అవార్డ్స్! 




దుబాయ్ లో ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా జరిగే గామా అవార్డ్స్ గల్ఫ్ తెలుగు సినీ అవార్డ్స్ చరిత్రలో ఒక ట్రెండ్ సృష్టించింది. అదే స్ఫూర్తి తో 2024 మార్చి 3న మరింత భారీగా గామా అవార్డ్స్ కార్యక్రమం  నిర్వహించబోతున్నారు నేషనల్ అవార్డ్ విన్నర్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రత్యేక అతిథిగా "గామా నేషనల్ ఐకాన్ అవార్డ్" అందించాలని,

 తెలుగు సినిమా చరిత్రలోనే అత్యధిక కలెక్షన్లు సాధించడంతో పాటు 57 ఏళ్ల నేషనల్ అవార్డ్ చరిత్రలో జాతీయ స్థాయిలో మొట్టమొదటి సారి, ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు  అందుకున్న తెలుగు తేజం ఐకాన్ స్టార్ " శ్రీ అల్లు అర్జున్" గారికి , వేలాదిమంది తెలుగు, తమిళ, మళయాల సినీ ప్రేమికుల మధ్యలో దుబాయ్ గామా వేదిక పై ప్రత్యేక సత్కారం చేయాలని, భావిస్తున్నట్లు గామా అవార్డ్స్ చైర్మన్ శ్రీ కేసరి త్రిమూర్తులు తెలియజేసారు.     


మార్చ్ 3,2024 న దుబాయి లో జరగబోయే ఈ గామా అవార్డ్స్ కార్యక్రమానికి తెలుగు సినిమా రంగానికి చెందిన పలువురు ప్రముఖులు హాజరవుతున్నారు. 2021,2022, 2023 సంవత్సరంలో ఉత్తమ చిత్రాలు, నటులు, దర్శకులు, సంగీతం విభాగాలలో ప్రతిష్టాత్మకమైన గామా అవార్డ్స్ అందజేయనున్నట్టు, అదేవిధంగా, గామా స్థాపించినప్పటి నుండి ఈనాడు ETV లో ప్రసారం చేస్తూ గామా అవార్డు వేదికకు సహాయ, సహకారాలు అందిస్తున్న ETV యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియ  చేస్తూ,  ఈ సారి కూడా గామా అవార్డు ఫంక్షన్ ను ETV లో ప్రసారం చేయడం  సంతోషంగా ఉంది అని గామా అవార్డ్స్ CEO సౌరభ్ కేసరి తెలిపారు.         

 

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ దర్శకులు సుకుమార్(పుష్ప), బాబీ(వాల్తేరు వీరయ్య), బుచ్చిబాబు సన(ఉప్పెన), మెగా బ్రదర్ నాగబాబు  ప్రముఖ దర్శకులు శ్రీ వీ.ఎన్.ఆదిత్య ,  నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత శ్రీ నవీన్, వైజయంతి మూవీస్ వారసురాళ్లు శ్రీమతి స్వప్న దత్,  ప్రియాంక దత్(సీతారామం), శ్రీ DVV దానయ్య(RRR), శ్రీ TG విశ్వప్రసాద్ గారు(పీపుల్ మీడియా ఫ్యాక్టరీ), గీతా ఆర్ట్స్ సంస్థ, నిర్మాత శ్రీ బన్నీ వాసు గారు, RRR టీం, పుష్ప టీం, సీతారామం టీం,

భగవంత్ కేసరి టీం , ప్రముఖ సంగీత దర్శకులు డా. కోటి, DSP, SS తమన్, MM శ్రీలేఖ, రఘు కుంచె, అనూప్ రుబెన్స్, హేషం అబ్దుల్ వహాబ్, గాయకులు మనో, ధనుంజయ్,

తెలుగు సినిమాకి ఆస్కార్ ఖ్యాతి నందించిన లెజెండ్ శ్రీ ఎమ్.ఎమ్.కీరవాణి గారు, గీత రచయిత శ్రీ చంద్రబోస్ గారు, ఇంకా మరెందరో సినీ హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, గాయనీ గాయకులు, కమెడియన్లు పాల్గొనే ప్రయత్నం చేస్తున్నామని, యాంకర్ సుమ, హైపర్ ఆది నిర్వహణలో ప్రముఖ టాలీవుడ్ గాయనీ  గాయకులతో పాటు, అందాల తారలు మరియు టీవీ కళాకారులు నిర్వహించే సంగీతం, నృత్యాలు, కామెడీ స్కిట్స్ వంటి వినోద కార్యక్రమాలతో పాటు గల్ఫ్ లోని స్థానిక ప్రత్యేక వినోద కార్యక్రమాలు 10వేల మందికి పైగా ప్రేక్షకుల సాక్షిగా అలరించబోతున్నట్టు  గామా అవార్డ్స్ జ్యూరీ సభ్యులు మరియు గౌరవ సలహాదారుడు ప్రముఖ దర్శకులు శ్రీ VN ఆదిత్య తెలిపారు.          


2021, 2022, 2023 లో విడుదలైన చిత్రాలనుంచి - బెస్ట్ యాక్టర్(మేల్, ఫిమేల్), బెస్ట్ మూవీ డైరెక్టర్,   బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్, బెస్ట్ సింగర్ (మేల్, ఫిమేల్), బెస్ట్ బాక్ గ్రౌండ్ స్కోర్, బెస్ట్ లిరిక్స్, బెస్ట్ సెలబ్రిటీ సింగర్, వంటి వివిధ కేటగిరీల నామినేషన్ సాధించిన వారికి ఆన్ లైన్ ఓటింగ్, మీడియా రిపోర్ట్స్, గామా జ్యూరీ ఛైర్ పర్సన్ గా నేను,  శ్రీలేఖ, దర్శకులు శ్రీ VN ఆదిత్య గార్లు  నిర్ణయించిన  విజేతలకు గామా అవార్డ్స్ తో సత్కరించడం జరుగుతుంది అని, ఈ గామా అవార్డ్స్ మరో ఆస్కార్, గ్రామ్మీ అవార్డ్స్ స్థాయికి చేరుకోవాలని మ్యూజిక్ డైరెక్టర్ డా. కోటి ఆశాభావం వ్యక్తం చేశారు.   

 

3 సంవత్సరాలు వేలాది మంది ప్రేక్షకుల సమక్షంలో దుబాయ్ వేదికగా అంగరంగ వైభవంగా హ్యాట్రిక్ హిట్ గా నిర్వహించిన "గామా అవార్డ్స్" లో బాహుబలి ప్రభాస్, రాణా, తమన్నా, చార్మి, లక్ష్మీ మంచు, శ్రీకాంత్, సాయికుమార్, ఆది, శర్వానంద్, అల్లరి నరేష్, ఆలీ ఇంకా ఎందరో స్టార్ లను దుబాయి వేదిక మీదకు తెచ్చిన గామా  ఈ సారి   భారతీయ సినిమాకు జాతీయ అంతర్జాతీయ స్థాయిలలో పురస్కారాలు అందుకున్న RRR, పుష్ప చిత్రాల యూనిట్ కు ప్రత్యేక సత్కారాలు, మరియు ఎన్నో వైవిధ్యభరితమైన కార్యక్రమాలతో తీర్చిదిద్దుతున్నట్టు, ఆస్కార్ పురస్కారం అందుకున్న శ్రీ కీరవాణి, శ్రీ చంద్రబోస్ గార్లకు ప్రత్యేకంగా  "గామా గౌరవ్ సత్కార్" తో పాటు, ప్రఖ్యాత గాయకులు శ్రీ SPబాలసుబ్రహ్మణ్యం గారి స్మృతిగా "గామా SPB గోల్డెన్ వాయిస్ అవార్డు" ను గాయకులు శ్రీ మనో గారికి అందిస్తున్నామని  గామా అవార్డ్స్  దర్శకులు   ప్రసన్న పాలంకి తెలియ చేశారు   

 

సినిమా అవార్డ్స్ కార్యక్రమంలో తెలుగు సినిమా ప్రాముఖ్యత లేకపోవడం చూసి, తెలుగు సినిమాకి, సినిమా సంగీతానికి అంతర్జాతీయ స్థాయిలో సరైన గుర్తింపు లభించాలన్న తలంపుతో ఏర్పాటైన గామా అవార్డ్స్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని, తాను గత 3 గామా అవార్డ్స్ కి అతిధిగా వెళ్ళానని ఎంతో వైభవంగా గామా అవార్డ్స్ జరుగుతాయని, మళ్లీ ఈసారి  ,జ్యూరీ సభ్యురాలిగా వెళ్ళడం ఆనందంగా ఉందని MM శ్రీలేఖ అన్నారు.



Share this article :