Home » » Premaku Jai Teaser Launched

Premaku Jai Teaser Launched

 ప్రముఖ గేయ రచయిత శివశక్తి దత్త చేతుల మీదుగా

'ప్రేమకు జై' టీజర్ లాంచ్ఈశ్వర పరమేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై  అనసూర్య  నిర్మించిన చిత్రం 'ప్రేమకు జై'.  గ్రామీణ నేపథ్యంలో జరిగిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా నూతన నటీనటులతో శ్రీనివాస్ మల్లం  దర్శకత్వంలో ఈ చిత్రం రూపోందింది. యంగ్ టాలెంటెడ్ అనిల్ బురగాని, ఆర్. జ్వలిత హీరోహీరోయిన్లుగా ప్రతినాయకునిగా దుబ్బాక భాస్కర్ నటించారు. పోస్ట్ ప్రోడక్షన్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నూతన సంవత్సరంలో విడుదల కానుంది. తాజాగా ప్రఖ్యాత లిరిక్స్ రైటర్ శివశక్తి దత్త చేతుల మీదుగా పోస్టర్, టీజర్ రిలీజ్ చేయడం జరిగింది.


 ఆనంతరం శివశక్తి దత్త గారు మాట్లాడుతూ....''యంగ్ టాలెంట్ బాగా చేశారు. నూతన న‌టీనటులు చాలా అద్భుతంగా నటించారు. డైరెక్షన్  చాలా బాగుంది. ఈ టీజర్ చాలా బాగుంది. చిత్ర యూనిట్  శుభాకాంక్షలు'' అన్నారు.


ఈ చిత్రంలో అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు హీరోహీరోయిన్లు కృతజ్ఞతలు తెలిపారు... 


హీరోహీరోయిన్లు: అనిల్ బురగాని,  ఆర్ జ్వలిత 

దర్శకత్వం: శ్రీనివాస్ మల్లం 

నిర్మాత:  అనసూర్య 

లైన్ ప్రొడ్యూసర్:  మైలారం రాజు,

DOP:  ఉరుకుందా రెడ్డి, 

మ్యూజిక్ : చైతు, 

ఎడిటర్: సామ్రాట్ జి, 

ఫైట్స్: రాబిన్ సుబ్బు , డైనమిక్ మధు

కొరియోగ్రాఫర్ : బాలు

పి.ఆర్.ఓ: దయ్యాల అశోక్


Share this article :