Home » » Telangana Film Chamber of Commerce Supports BRS

Telangana Film Chamber of Commerce Supports BRS

బి.ఆర్. యస్. పార్టీకి మద్దతు ఇవ్వండి..

తెలంగాణ ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్



నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ పరిపాలనలో అద్భుతమైన అభివృద్ధి జరిగిందని, ముఖ్యంగా చిత్ర పరిశ్రమకు కెసిఆర్ ప్రభుత్వం అనేక సౌకర్యాలు కల్పింస్తోందని, చిత్ర పరిశ్రమకు చెందిన సమస్యలకు పరిష్కారాన్ని వెంటనే చూపిస్తోందని తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు ప్రతాని రామకృష్ణ గౌడ్ అన్నారు.

ఇప్పటికే రెండు టర్మ్స్ ముఖ్యమంత్రిగా పనిచేసిన కెసిఆర్ మరోసారి ముఖ్యమంత్రి అయితే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వేగంగా పూర్తవుతాయని, కావున తెలుగు చిత్ర పరిశ్రమలోని 24 క్రాప్స్ లో పనిచేస్తున్న కార్మికులు వారి కుటుంబ సభ్యులు బిఆర్ఎస్ పార్టీకి అండగా నిలవాలని కోరుతూ తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.


ఈ సందర్భంగా చాంబర్ అధ్యక్షులు ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ...

గత పది సంవత్సరాలుగా ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను చేస్తోంది దానికి సపోర్ట్ చేయాలని ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మన తెలుగు సినీ చిత్ర పరిశ్రమలో 24 క్రాఫ్ట్స్ లో దాదాపుగా లక్ష మంది పైనే ఉంటారు. సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మరియు ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్, టూరిజం మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ లు ముందుకు వచ్చి చిన్న సినిమా, పెద్ద సినిమా అని తేడా లేకుండా సినిమా విడుదల విషయంలో కానీ, రేట్ల విషయంలో గాని ఎప్పుడూ అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరించారు. స్థానిక శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ దృష్టికి మన జూనియర్ ఆర్టిస్టుల సమస్యలను తీసుకుని వెళితే ఆయన స్పందించి కొంతమందికి డబల్ బెడ్ రూమ్ ఇల్లు కూడా ఇప్పించారు. అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి కూడా కొంతమందికి సాయం అందించడం జరిగింది. ఒకప్పుడు కరెంటు సమస్య చాలా ఉండేది. అయితే ఇప్పుడు 24 గంటలు కరెంటుతో ప్రజలకు ఇబ్బంది లేదు. ఇది సీఎం కేసీఆర్ సాధించిన ఘనతల్లో ఒకటి. భారతదేశంలోనే మన రాష్ట్రంలో అధికంగా వరి పండిస్తున్నాం. 24 గంటల కరెంటుతో రైతులు ఈ విజయాన్ని సాధించారు .. కెసిఆర్ గారు మళ్ళీ సీఎం అయితే కచ్చితంగా నంబర్ వన్ స్థానానికి చేరుకుంటాం. ఈ ప్రభుత్వంలో దాదాపు 34 మెడికల్ కాలేజీలు తీసుకురావటం జరిగింది. కెసిఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తరువాత తెలంగాణలో 18 మాత్రమే ఉన్న హాస్పిటల్స్ 60కి పైగా చేరటం మనం గమనించాలి. నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ ప్రాబ్లం చాలా ఉండేది. అయితే ఇప్పుడు ఆ సమస్య చాలావరకు తీరిపోయి, ప్రతి ఇంటింటికి స్వచ్ఛమైన తాగునీరు అందుతోంది. ప్రస్తుతం నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ జీరో పర్సెంట్. రైతుబందు అనేది కేవలం కేసీఆర్ గారి అద్భుత ఆలోచన. ఇంతకుముందు ఎవరు అమలు పరచని పథకం. దీనివల్ల 70 లక్షల మంది రైతులకు లబ్ధి జరిగింది. కెసిఆర్ గారు మళ్లీ సీఎం అయితే ఈసారి 16 వేల రూపాయలు ఈ పథకం కింద ఇస్తారు. అలాగే 400కు గ్యాస్ సిలిండర్, ఆసరా పింఛన్లు 5వేలకు పెరుగుతాయి. అలాగే సన్న బియ్యం ఉచిత పంపిణీ చేయడానికి అవకాశం వుంది. ఇలా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి పరిశ్రమకు చెందిన లక్ష మంది కుటుంబ సభ్యులు తప్పకుండా బిఆర్ఎస్ పార్టీకి మద్దతుగా కారు గుర్తుకు ఓటు వేయించవలసిందిగా తెలంగాణ ఛాంబర్ తరపున విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు.


సీనియర్ నటుడు విలన్ పాత్రలు పోషించే సత్య ప్రకాష్ మాట్లాడుతూ...

 తెలంగాణ ప్రాంతంలోని ప్రజల కష్ట నష్టాలను తీర్చడానికి కర్కాటక రాశిలో పుట్టిన కెసిఆర్ గారు అందరినీ తన వారిగా చూసుకుంటున్నారు. ఈ రాశిలో జన్మించిన వారి లక్షణం అందరిని తన వారిగా భావిస్తారు. తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉండాలి అంటే కెసిఆర్ గారిని మరోసారి ముఖ్యమంత్రిని చేసుకోవాలి. మరో ఐదు సంవత్సరాలు పాటు కెసిఆర్ తో కలిసి నడుద్దాం అన్నారు. ఈ సందర్భంగా కెసిఆర్ మీద. ఓ పాటను పాడి వినిపించారు.


హాస్యనటుడు గౌతమ్ రాజు మాట్లాడుతూ...

తెలంగాణ ప్రాంతానికి సంబందించినంతవరకు కెసిఆర్ జాతిపితగా గౌరవం పొందారు. ఆయన చావు అంచుల వరకు వెళ్లి, తెలంగాణను తీసుకొచ్చారు. అందుకే అందరూ కారు గుర్తుకు ఓటు వేయాలని, చిత్ర పరిశ్రమకు చెందిన లక్షకు పైగా ఉన్న మన సహచరులందరూ కెసిఆర్ కు మద్దతుగా కారు గుర్తుకు ఓటు వేయాలని అన్నారు.



టిఎఫ్ సి సి వైస్ చైర్మన్ గురు రాజ్ మాట్లాడుతూ...

ఒకప్పుడు ఈ ప్రాంతంలో దొరల రాజ్యం నడిచేది అప్పుడు అందరం చెప్పులు చేత్తో పట్టుకుని వెళ్లాల్సి వచ్చేది. అట్లాంటి సామాజిక జీవనంలో ఎన్టీఆర్ రాకతో చాలా మార్పులు వచ్చాయ. రాజకీయంగా సామాన్యులు సైతం ముందుకు దూకారు . ఆ తర్వాత మళ్లీ 2014 లో కెసిఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రమే తెలంగాణలో అభివృద్ధి సంక్షేమం సామాజిక చైతన్యం పెరిగింది. తెలంగాణ గురించి చెప్పాలంటే కెసిఆర్ కు ముందు తర్వాత అని చెప్పాలి. అంతగా కెసిఆర్ తన ముద్రను పరిపాలనపై వేశారు. దక్షిణ భారతదేశంలో

కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అయి రికార్డు సాధించబోతున్నారు. చిత్ర పరిశ్రమలోని అందరూ కారు గుర్తుకు ఓటు వేసి కెసిఆర్ గారిని గెలిపించవలసిందిగా కోరుతున్నాం అన్నారు.



బంధూక్ దర్శకుడు లక్ష్మణ్ మాట్లాడుతూ...

 తెలంగాణ ఏర్పడిన తర్వాత మేము ఆర్టిస్టులు టెక్నీషియన్లు మధ్య కొన్ని ఇబ్బందులు ఉన్నాయని, తెలంగాణ ప్రాంత వాసులకు అన్యాయం జరుగుతోందన, ఈ విషయం మీద ఉద్యమం చేస్తామని అన్నాము.  అయితే కెసిఆర్ గారు తెలంగాణ వచ్చిన తర్వాత మళ్లీ కొట్లాటలు వద్దు. ఇప్పుడు ఆంధ్ర సినిమా తెలంగాణ సినిమా అని లేదు . అంతా మన తెలుగు సినిమా అన్నారు. కాబట్టి తెలుగు సినీ పరిశ్రమకు చెందిన అందరూ బిఆర్ఎస్ కు మద్దతుగా కారు గుర్తుకు ఓటు వేసి కెసిఆర్ గారిని గెలిపించవలసిందిగా కోరుతున్నా అన్నారు.



టి ఎఫ్ సి సి సెక్రటరీ సాగర్ మాట్లాడుతూ...

 తెలంగాణ ప్రభుత్వం ఎంతో పటిష్టమైన నాయకత్వంలో ఉంది. దీన్ని మరింత పటిష్టం చేయాలంటే కెసిఆర్ గారిని మళ్లీ మనం ముఖ్యమంత్రిగా చేసుకోవాలి.  కెసిఆర్ గారి ప్రభుత్వం చిత్ర పరిశ్రమకు వెన్ను దన్నుగా నిలిచి, ఎంతోమంది ఆర్టిస్టుల, కార్మికులకు జీవితాలకు  భరోసాను కల్పించింది. కాబట్టి అందరూ కారు గుర్తుకు ఓటేసి, కెసిఆర్ గారికి మద్దతు తెలపాల్సిందిగా చిత్ర పరిశ్రమకు చెందిన వారిని అందరిని కోరుతున్నాం అన్నారు.



రమేష్ నాయుడు నిర్మాత మాట్లాడుతూ...

 తెలంగాణను అన్ని విధాల ప్రపంచ పటంలో పెట్టిన కెసిఆర్ గారు ఆంధ్ర తెలంగాణ బేధం లేకుండా అందరికీ ఇష్టమైన పరిపాలన చేశారు. ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి ఎటువంటి ఆటంకం లేకుండా ముందుకు పోవాలంటే మళ్లీ కెసిఆర్ గారే ముఖ్యమంత్రిగా రావాలి.  కెసిఆర్ గారి కోసం కాదు మన పిల్లల కోసం, భవిష్య తరాల కోసం కెసిఆర్ గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది అన్నారు.


కాచం సత్యనారాయణ మాట్లాడుతూ...

 ఈ పది సంవత్సరాలలో చిత్ర పరిశ్రమకు చెందిన అన్ని  వర్గాల వారు హైదరాబాదులో ఎంతో సంతోషంగా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉన్నారు. గాంధీ గారు దేశానికి స్వాతంత్రం తెచ్చినట్టు కెసిఆర్ గారు తెలంగాణకు తెలంగాణను సాధించుకుని వచ్చారు.  కాబట్టి అందరం ఆయన్ను మళ్లీ సీఎంగా చేసుకోవాలి. దీనికోసం ప్రతి ఒక్కరూ  కారు గుర్తుపై ఓటు వేయాలి అన్నారు.



ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న గౌడ్, యాంకర్ మానస తదితరులు అందరూ టిఎఫ్ సిసి తరఫున బిఆర్ఎస్ కు  మద్దతు తెలుపుతూ కారు గుర్తుకు ఓటు వేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. 


Share this article :