సంతోషం సినీ అవార్డుల వేడుకకు ముఖ్యఅతిథిగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్
సంతోషం... సంతోషం... సంతోషం ఇప్పుడు ఎక్కడ చూసినా సంతోషం అవార్డుల గురించే చర్చ జరుగుతోంది. ప్రతి ఏటా నిర్వహించే లాగే ఈ ఏటా సంతోషం అవార్డుల వేడుకను ఘనంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. అయితే ప్రతిసారి హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో జరిగే ఈ వేడుకలు ఈసారి మాత్రం సౌత్ ఇండియా మొత్తం తిరిగి చూసేలా గోవాలో నిర్వహించేందుకు సురేష్ కొండేటి ప్రణాళికలు సిద్ధం చేశారు. డిసెంబర్ రెండో తేదీన మధ్యాహ్నం 3:30 గంటల నుంచి డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ ఇండోర్ స్టేడియం గోవాలో జరగబోతున్న ఈ వేడుకలకు సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున డిజిటల్ ప్రమోషన్స్ తో పాటు గోవాలో సైతం ఆఫ్ లైన్ ఆన్లైన్ ప్రమోషన్స్ పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఇక ఈ వేడుకకు ముఖ్యఅతిథిగా ఒక పాన్ ఇండియా స్టార్ హీరో హాజరు కాబోతున్నారు, ఆయన మరెవరో కాదు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ. ఆర్ఆర్ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్న ఆయన ప్రస్తుతం మైసూర్ లో షూటింగ్లో పాల్గొంటున్నారు. సురేష్ కొండేటి తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ను కలిసి ఆయనను సంతోషం సౌత్ ఇండియా ఫేమ్ అవార్డ్స్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజర అవ్వాలని కోరితే దానికి ఆయన సంతోషంగా గ్రీన్ సిగ్నల్ చేశారు. ఈ నేపథ్యంలో సురేష్ కొండేటి రామ్ చరణ్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం గోవాలో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ జరుగుతోంది దాని మీ అనుసరిస్తూ సంతోషం సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్ వేడుక కూడా ఘనంగా జరగబోతోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ ఈ వేడుకకు హాజరు కాబోతున్నారని తెలియడంతో రెండు తెలుగు రాష్ట్రాల మెగా అభిమానులతో పాటు సినీ అభిమానులు సైతం గోవా వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.