సురేష్ కొండేటికి మెగా విషెస్
సినీ జర్నలిస్టు, సినిమా డిస్ట్రిబ్యూటర్, నిర్మాత, నటుడు, మెగా పీఆర్వో సురేష్ కొండేటి ఈరోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఆయన పుట్టిన రోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.. మెగాస్టార్ చిరంజీవి నివాసంలో సురేష్ కొండేటికి శుభాకాంక్షలు తెలియచేస్తూ సురేష్ ఇలాంటి పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు. ఇక ఆ తరువాత మెగాస్టార్ నివాసంలోనే సురేష్ కొండేటి చేత కేక్ కట్ చేయించారు. అలాగే ఫ్లవర్ బొకేతో శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు. ఇక ఈ ఫోటోలను సురేష్ తన సోషల్ మీడియాలో షేర్ చేయగా అవన్నీ వైరల్ అవుతున్నాయి.
Post a Comment