Home » » Mee Kadupuninda Restaurant Launched Grandly

Mee Kadupuninda Restaurant Launched Grandly

 ఏపీ టూరిస్ట్ మినిస్టర్ రోజా మరియు సినీ సీరియల్ ఆర్టిస్టుల సమక్షంలో మీ కడుపునిండా గ్రాండ్ గా ప్రారంభం...



మీ కడుపునిండా తెలుగువారి రుచులు ప్రారంభోత్సవ సందర్భంగా శ్రీమతి రోజా గారు మాట్లాడుతూ శ్రీవాణి సీరియల్ లో మనందరికీ తెలిసిన వ్యక్తి. శ్రీవాణి విక్రమాదిత్య సందీప్ లకు నా శుభాకాంక్షలు మీ కడుపునిండా అనేది మణికొండలో అందరికీ సీనియర్ ఆర్టిస్టులు కానీ యాక్టర్లు గాని ఎంతోమంది మణికొండలో ఉంటున్నారు సో మణికొండ లో ఉన్న వారందరికీ అందుబాటులో దగ్గరగా ఉండేలాగా మీ కడుపునిండాన్ని ప్రారంభించారు వారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే మీడియాతో ముచ్చటించిన రోజా గారు తనకు నచ్చిన నాన్ వెజ్ వంటకాలు గురించి సరదాగా రొయ్యల ఇగురు చేపల పులుసు ఇవన్నీ నాకు ఇష్టం నేను వంట కూడా బాగా చేస్తాను కానీ నేను చేసిన దానికి నా భర్త పిల్లలు ఎలా ఉందని వాళ్లే చెప్పాలి నేను కాదు కదా అంటూ సరదాగా ముచ్చటించడం జరిగింది. అలాగే ఈ మీ కడుపునిండా లో వెజ్ నాన్ వెజ్ వంటకాలు అన్నీ కూడా ఆంధ్ర స్టైల్ లో అందుబాటులో ఉంటాయి. అచ్చమైన తెలుగు వంటకాలు ఇక్కడ కచ్చితంగా లభిస్తాయి సో తెలుగు వారందరూ ఇక్కడొకసారి వచ్చి టేస్ట్ చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను అన్నారు.


Share this article :