Home » » Actress Megha Akash Birthday Celebrations at Sahakutumbanaam Sets

Actress Megha Akash Birthday Celebrations at Sahakutumbanaam Sets

 సఃకుటుంబనాం చిత్ర సెట్స్ లో హీరోయిన్ మేఘాఆకాశ్ పుట్టినరోజు వేడుకలు  




రామ్‌కిర‌ణ్‌, మేఘాఆకాశ్ జంట‌గా న‌టిస్తున్న తాజా చిత్రం సఃకుటుంబ‌నాం. ఇటీవల లాంఛనంగా ప్రారంభం అయిన ఈ చిత్రం మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఫ్యామిలీ ఎమోషన్స్, వినోదం కలిగి ఉన్న ఈ మూవీ సెట్స్ లో హీరోయిన్ మేఘాఆకాష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. 


హెచ్ఎన్‌జీ మూవీస్ సినిమాస్ ప‌తాకంపై ఉద‌య్‌శ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో హెచ్‌.మ‌హాదేవ్ గౌడ‌, హెచ్‌.నాగ‌ర‌త్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 


రాజేంద్రప్ర‌సాద్‌, బ్ర‌హ్మానందం, స‌త్య‌, రాహుల్ రామకృష్ణ. ర‌చ్చ‌ర‌వి, శుభ‌లేఖ సుధాక‌ర్‌, భ‌ద్రం, ప్ర‌గ‌తి త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మ‌ణిశ‌ర్మ‌, ఎడిటింగ్‌: శ‌శాంక్ మాలి, పాట‌లు: అనంత్ శ్రీ‌రామ్‌, కెమెరా: మ‌ధు దాస‌రి, ఆర్ట్‌: పీఎస్ వ‌ర్మ‌, అడిష‌నల్ స్కిన్‌ప్లే: బాలాజి భువ‌న‌గిరి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత‌: రోహిత్ ప‌ద్మ‌నాభం, క‌థ‌-క‌థ‌నం-మాట‌లు-ద‌ర్శ‌క‌త్వం: ఉద‌య్‌శ‌ర్మ‌.


Share this article :