Tremendous Response For Nenena in aha

 ఆహా లో అనూహ్య స్పందన తో దూసుకుపోతున్న నేనేనా సినిమా



తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టిన చాలా కాలమే అయినా ఎక్కడ క్రేజ్ తగ్గని హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే అది రెజీనా కసాండ్రా .

రెజీనా ప్రస్తుతం ఆపిల్ ట్రీ స్టూడియోస్ ప్రొడక్షన్ లో “నేనేనా" అనే సినిమాను చేస్తుంది. కార్తీక్ రాజు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అక్షర గౌడ , అలీ ఖాన్ , జై ప్రకాష్ వంటి కీలక నటులు నటిస్తున్నారు. శ్యామ్ సి ఎస్ సంగీతం అందిస్తున్నారు. జాంబిరెడ్డి సినిమాతో మంచి హిట్ అందుకున్న ఆపిల్ ట్రీ స్టూడియోస్ ప్రొడక్షన్ పై ఈ చిత్రం తెరకెక్కింది.


 ఆగస్ట్ 25న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోయింది. ఈ  సినిమా విభిన్నంగా , మంచి కంటెంట్‌తో, ఎవరు ఊహించని థ్రిల్లర్ డ్రామాగా ఉంటుంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ ప్లాట్ఫారం ఆహా లో స్ట్రీమ్ అవుతుంది .ఓటీటీ లో ఎవరు ఊహించని అనూహ్య స్పందన వస్తుంది. ఈ సినిమా స్పందన చూసి చిత్ర బంధం ఆనందం వ్యక్తం చేస్తున్నారు


Post a Comment

Previous Post Next Post