Mission C 1000 First Look Launched by Abhishek Agarwal

 ''మిషన్ సి 1000'' సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన

కాశ్మీర్ ఫైల్స్ నిర్మాత అభిషేక్ అగర్వాల్  




ఎస్ వి క్రియేషన్ పతాకంపై తేజేశ్వర్ కథానాయకుడిగా నటిస్తూ దర్శకత్వం వహించిన ''మిషన్ సి 1000'' సినిమా ఫస్ట్ లుక్ ను కాశ్మీర్ ఫైల్స్ నిర్మాత అభిషేక్ అగర్వాల్ ఆవిష్కరించారు. తెలుగు, హిందీ భాషల్లో నిర్మించిన ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని , ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. శ్రీధర్ ఆత్రేయ  సంగీతం సమకూర్చిన ఈ సినిమాలో మొత్తం మూడు పాటలు ఉన్నాయి. హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీరాముడిపై చిత్రీకరించిన పాట  ఈ సినిమాలో హైలెట్ గా నిలుస్తుందని నటుడు, దర్శకుడు తేజేశ్వర్ ఆశాభావం వ్యక్తం చేశారు . ప్రముఖ నిర్మాత, జాతీయ అవార్డు నిర్మాత అభిషేక్ అగర్వాల్ మా సినిమా ఫస్ట్ లుక్ ను ఆవిష్కరించడం ఎంతో సంతోషంగా ఉందని, ఈ సందర్బంగా అభిషేక్ అగర్వాల్ కు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని తేజేశ్వర్ అన్నారు. బెంగళూరుకు చెందిన ప్రగ్య నయన్ హీరోయిన్ గా నటించింది. ఆరాధ్యదేవుడు రాముడిపై చిత్రీకరించిన పాటను త్వరలోనే విడుదల చేస్తామని నిర్మాత టి. విరాట్ అండ్ సుహాసిని తెలిపారు. త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నామని టి.విరాట్ అండ్ టి.శౌర్య అన్నారు.


నటీనటులు

తేజేశ్వర్ ,

ప్రగ్య నయన్ ,

కబీర్ సింగ్ ,

జయ ప్రకాష్ ,

సుధా,

అనీష్ కురువిళ్ళ ,

సంజయ్ పాండే ,

కాళీ చరణ్ మహారాజ్ .


సాంకేతిక నిపుణులు

సినిమాటోగ్రఫీ : మహేందర్ ఎస్.

సంగీతం : శ్రీధర్ ఆత్రేయ .

ఎడిటర్ : మార్తాండ్ కె వెంకటేష్ .

కొరియోగ్రఫీ : గణేష్ స్వామి.

ఫైట్స్ : స్టంట్ జాషువా .

VFX: అనంత్ ఇయ్యున్ని .


ఎగ్జ్ క్యూటివ్ ప్రొడ్యూసర్స్ :

డాక్టర్ ఎలాసాగరం ప్రభాకర్ ,

రేవంత్ ,

గండికోట శ్రీనివాస్ .

సహా నిర్మాతలు

ఎం. మురళి, ఉమ మహీంద్ర, జగదీశ్వర్, సుశీల్,శివ,మధు, సౌజన్య .

నిర్మాత : శ్రీమతి . సుహాసిని

కథ, స్క్రిన్ ప్లే , దర్శకత్వం : తేజేశ్వర్


Post a Comment

Previous Post Next Post