Home » » Naa nee Prema Kadha Review

Naa nee Prema Kadha Review



 రివ్యూ : ‘నా నీ ప్రేమ కథ’

తారాగణం : అముద శ్రీనివాస్‌, కారుణ్య చౌదరి, రమ్య శ్రీ, అజయ్‌ ఘోష్‌, షఫీ, ఫిష్‌ వెంకట్‌, అన్నపూర్ణమ్మ తదితరలు. 

కెమెరా :  ఎంఎస్‌ కిరణ్‌ కుమార్‌

సంగీతం : ఎమ్‌ ఎల్‌ పి రాజా 

ఆర్‌ఆర్‌ : చిన్నా

ఎడిటర్‌ : నందమూరి హరి

నిర్మాణం: పిఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌

నిర్మాత: పోత్నాక్‌ శ్రవణ్‌ కుమార్‌

రచన, దర్శకత్వం: అముద శ్రీనివాస్‌


కథ: నాని (అముద శ్రీనివాస్‌) చిన్న గ్రామంలో పేపర్‌బాయ్‌గా పని చేస్తాడు. అజయ్‌ ఘోష్‌ గ్రామ పెద్ద. ఆయన  కూతురు నందిని (కారుణ్య) హైదరాబాద్‌లో డాక్టర్‌ చదివి, స్వగ్రామంలో ఆసుపత్రిని నిర్మించి గ్రామ ప్రజలకు సేవాలని సొంతూరుకి తిరిగొస్తుంది. నాని నందినిని 

 గుణ(షఫీ) కూడా నందినిని ప్రేమిస్తాడు ఈ విషయం తెలుసుకుని నందిని తండ్రి నాయుడు (అజయ్‌ ఘోష్‌) నానిని చంపాలనుకుంటాడు.  అదే అమ్మాయిని ప్రేమిస్తున్న గుణ (షఫి) నాని రక్షిస్తాడు. తను ప్రేమిస్తున్న అమ్మాయిని మరో వ్యక్తి ప్రేమిస్తున్నాడని తెలిసి... అతన్ని రక్షించడం.. అతనిలో వచ్చిన మార్పా? లేక నమ్మించి వేరే ఏమన్నా ప్లాన్‌ చేశాడా? చివరికి నాని, నందిని పెళ్లి చేసుకున్నారా? చివరికి ఏమైంది అన్నది మిగతా కథ. 


ముగ్గురు మధ్య సాగే ముక్కోణపు ప్రేమకథ ఇది. నానీని రక్షించిన సమయంలో గుణలో మార్పు దాని వెనకున్న సస్పెన్స్‌ను దర్శకుడు బాగా డీల్‌ చేశాడు. అయితే దర్శకుడే హీరో కావడంతో అటు హీరో పని, ఇటు దర్శకుడి బాఽధ్యత రెండు ఒత్తిడి కావడంతో ఎక్కడో డైరెక్షన్‌ మీద పట్టు తప్పింది అనిపించింది. హీరో పాత్రకు న్యాయం చేశాడు కాకపోతే హీరో స్థానంలో మరో హీరోని తీసుకుని ఉంటే అతని మీద ఒత్తిడి తగ్గి అవుట్‌పుట్‌ ఇంకాస్త బెటర్‌గా వచ్చేది. గ్రామీణ ప్రాంతానికి చెందిన వ్యక్తులుగా  అముద శ్రీనివాస్‌, కారుణ్య చౌదరి చక్కని నటన కనబర్చారు. సిటీలో డాక్టర్‌ చదివివచ్చినా గ్రామీణ మూలాలు మరచిపోకుండా సంప్రాదాయగా  కనిపించడంలో కారుణ్య వంద శాతం సక్సెస్‌ అయింది. షఫీ గుణ పాత్రలో ఇమిడిపోయారు. అజయ్‌ఘోష్‌ తదితరులు తమ పాత్రల మేరకు న్యాయం చేశారు. టెక్నికల్‌ విషయాలకు వస్తే... దర్శకుడు ప్రేమ, భావోద్వేగపు సన్నివేశాలను చక్కగా చెప్పాడు. అయితే స్ర్కీన్‌ప్లే విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకుని ఉంటే బాగుండేది. అలాగే కెమెరా పనితీరు బావుంది. విలేజ్‌ అందాలను బాగా చిత్రీకరించినా అక్కడక్కడా డల్‌గా అనిపించింది. ఎడిటింగ్‌ ఫర్వాలేదు. రెండు పాటలు గుర్తుంచుకునేలా ఉన్నాయి. నేపథ్యసంగీతం బాగా కుదిరింది. క్లైమాక్స్‌ ట్విస్ట్‌ హైలైట్‌గా అనిపించింది. నిర్మాణ విలువలు ఎక్కడా తగ్గలేదు. చేసిన ఖర్చు తెరపై కనిపిస్తుంది. రొటీన్‌ ప్రేమకథే అయినా తెరకెక్కించిన తీరు ఆసక్తికరంగా ఉండడంతో ప్రేక్షకుల్ని అలరింస్తుంది. ట్రయాంగిల్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఎలాంటి అంచనాలు లేకుండా కుటుంబ సభ్యులతో కలిసి చూడొచ్చు. 


మనసుకు హత్తుకునే ప్రేమ కథ

రేటింగ్‌ : 3./5


Share this article :