మెఘాలయా అందాల్ని చూపిస్తూ లవ్, మౌళి మూవీ నుంచి “అందాలు చదివే కళ్ళకైనా” అనే క్రేజీ సాంగ్
టాలెంటెడ్ యాక్టర్ నవదీప్ చాలా రోజులు తరువాత హీరోగా నటిస్తున్న చిత్రం లవ్,మౌళి. వైవిధ్యమైన ఈ చిత్రాన్ని అవనీంద్ర దర్శకత్వం వహించారు, ఈ చిత్రాన్ని నైరా క్రియేషన్స్ మరియు శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్ పై చిత్ర నిర్మాణ పనులు టాలీవుడ్ టాలెంటెడ్ టెక్నిషియన్స్ కి అడ్డాగా మారిన సి స్సేస్ నిర్మాణ భాధ్యతలు తీసుకుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన నవదీప్ లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. గుబురు గడ్డం.. ఒక బైక్ ట్రావెలర్ గా నవదీప్ కనిపించడంతో సినిమా అభిమానులంతా ఆశ్యర్యానికి గురవ్వటమే కాక ఈ చిత్రం ఒక ఢిఫరెంట్ కాన్నెప్ట్ తొ అందర్ని ఆకట్టుకునేలా వుంటుందని ఫిక్స్ అయ్యారు. ఆ అంచనాలు ఏ మాత్రం తగ్గకుండా మ్యూజిక్ దర్శకుడు గోవింద్ వసంత అందించిన “ద ఏంతమ్ ఆఫ్ లవ్ మౌళి” సాంగ్ ను రిలీజ్ చేశారు. "అందాలు చదివే కళ్లకైనా.. ఖండాలు తిరిగే కాళ్లకైనా.. వందేళ్లు కదిలే గుండె కైనా.. ప్రేమన్న తీరం ఇదేనా? " అంటూ సాగే పాట అందర్ని ఆకట్టకుంటుంది అంతేకాక హీరో నవదీప్ చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. నవదీప్ 2.0 అంటూ ఈ మూవీతో తనని తాను కొత్తగా ఆవిష్కరించుకున్నాడు. ఇంతకుముందెన్నడూ చూడని విధంగా, పొడవాటి జుట్టు గుబురు గడ్డంతో సరికొత్త మేకోవర్ తో కనిపించి అందరినీ ఆకట్టుకుంటున్నాడు.. గోవింద వసంత మ్యూజిక్ డైరెక్టర్ గా ఈ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తూ మంచి హమ్మింగ్ సాంగ్ ని అందించాడు. ఆయన కంపోజ్ చేసిన ఈ పాటకు అనంత శ్రీరామ్ క్యాఛీ లిరిక్స్ రాశారు. అనీష్ కృష్ణన్ పాడిన విధానం అందర్నీ ఆకట్టుకుంటుంది. మేఘాలయలోని చిరపుంజీలో ఈ సినిమా షూటింగ్ మొత్తాన్ని చిత్రీకరించారు. ఇలాటి వెట్ ప్లేస్ లో షూటింగ్ మొత్తం జరిగిన ఫస్ట్ ఇండియన్ ఫిల్మ్ గా ఈ చిత్రం నిలిచింది. ఒక వైవిధ్యమైన ప్రేమకథని తెరకెక్కించాలంటే ఆ ప్రేమ కథ జరిగే ప్లేస్ కూడా చాలా ముఖ్యం. దానికి దర్శకుడికి విజువల్ ని ముందుగానే తను తీయబోయో చిత్రాన్ని చూడాలి. ఇండియాలోనే మొట్టమొదటి సారి అత్యంత గరిష్ట మైన తేమ వున్న ప్రదేశంలో ఈ చిత్ర కథని చూపించే ప్రయత్నం దర్శకుడు అవనీంద్ర చేయటం విశేషం గా చెప్పుకొవాలి. దర్శకుడు అవనీంద్ర ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తను అనకున్నది అనుకున్నట్టుగా చిత్రీకరించాడు అనటానికి ఈ సాంగ్ లో విజువల్స్ నిదర్శనం. ఈ చిత్రం తప్పకుండా అందర్ని అకట్టుకుంటుంది.
నటీనటులు: నవదీప్, పంఖురి గిద్వానీ, భావన సాగి, మిర్చి హేమంత్, మిర్చి కిరణ్ తదితరులు
బ్యానర్.. నైరా క్రియోషన్స్ అండ్ శ్రీకర స్టూడియోస్
నిర్మాణం .. సి స్పేస్
దర్శకత్వం, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ : అవనీంద్ర
సంగీత దర్శకులు: గోవింద్ వసంత
సింగర్: అనీష్ కృష్ణన్
రచన.. అనంత శ్రీరామ్
ఆర్ట్.. కిరణ్ మామిడి
పిఅర్ఓ : ఏలూరు శ్రీను- మధు మడూరి