నిర్మాత దిల్ రాజు లాంచ్ చేసిన దీపక్ సరోజ్, వి యశస్వీ ‘సిద్ధార్థ్ రాయ్’ నుంచి లైఫ్ ఈజ్ దిస్ బ్యూటిఫుల్ సాంగ్
టాలీవుడ్‌లోని దాదాపు అందరు స్టార్ హీరోలతో పనిచేసిన పాపులర్ చైల్డ్ ఆర్టిస్ట్, యంగ్ హీరో దీపక్ సరోజ్ 'సిద్ధార్థ్ రాయ్' తో హీరోగా అరంగేట్రం చేస్తున్నారు. హరీష్ శంకర్, వంశీ పైడిపల్లి వంటి పెద్ద దర్శకుల దగ్గర పనిచేసిన వి యశస్వీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
ఇటివలే విడుదలైన ఈ చిత్రం టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఈ చిత్రంలోని చెలియా చాలు పాట కూడా సూపర్ హిట్ అయ్యింది. తాజాగా సిద్ధార్థ్ రాయ్’ నుంచి లైఫ్ ఈజ్ దిస్ బ్యూటిఫుల్ పాటని ప్రముఖ నిర్మాత దిల్ రాజు లాంచ్ చేశారు.
స్టార్ కంపోజర్ రధన్ ఈ పాటని మెస్మరైజింగ్ అండ్ గ్రేస్ ఫుల్ నెంబర్ కంపోజ్ చేశారు. కార్తీక్ & శ్రీనిషా జయశీలన్ పాడిన ఈ పాటకు యశస్వీ అందించిన సాహిత్యం మళ్ళీ మళ్ళీ వినాలనిపించే లా వున్నాయి. ఈ పాటలో లీడ్ పెయిర్ లవ్లీ అండ్ రొమాంటిక్ కెమిస్ట్రీ చాలా ఎట్రాక్టివ్ గా వుంది.
శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్, విహాన్ & విహిన్ క్రియేషన్స్ పతాకాలపై ప్రొడక్షన్ నెం 1గా జయ అడపాక, ప్రదీప్ పూడి, సుధాకర్ బోయినలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ చిత్రంలో ప్రముఖ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. రధన్ సంగీతం అందిస్తుండగా, శ్యామ్ కె. నాయుడు కెమరా మెన్ గా, ప్రవీణ్ పూడి ఎడిటర్ గా పని చేస్తున్నారు.
తారాగణం: దీపక్ సరోజ్, తన్వి నేగి,నందిని, ఆనంద్, కళ్యాణి నటరాజన్, మాథ్యూ వర్గీస్
సాంకేతిక విభాగం:
కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: వి యశస్వీ
నిర్మాతలు: జయ ఆడపాక, ప్రదీప్ పూడి, సుధాకర్ బోయిన
బ్యానర్లు: శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్ & విహాన్ మరియు విహిన్ క్రియేషన్స్
లైన్ ప్రొడ్యూసర్: బి.శ్యామ్ కుమార్
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: శ్యామ్ కె. నాయుడు
సహ రచయితలు: అన్వర్ మహ్మద్, లుధీర్ బైరెడ్డి
సంగీత దర్శకుడు: రధన్
ఎడిటర్: ప్రవీణ్ పూడి
ఆర్ట్: చిన్నా
ప్రొడక్షన్ డిజైనర్: బాల సౌమిత్రి
యాక్షన్: పృథ్వీ
కొరియోగ్రఫీ: శంకర్, ఈశ్వర్ పెంటి
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి, బాలాజీ, పూర్ణా చారి, వి యశస్వీ
పీఆర్వో: వంశీ - శేఖర్
పబ్లిసిటీ డిజైనర్: అనిల్ & భాను
వీఎఫ్ఎక్స్: వర్క్‌ఫ్లో ఎంటర్‌టైన్‌మెంట్స్
Post a Comment