Home » » Heroine Sakshi Vaidya Interview About Gandeevadhari Arjuna

Heroine Sakshi Vaidya Interview About Gandeevadhari Arjuna

 గాండీవధారి అర్జున' షూటింగ్ లో హీరో వరుణ్ తేజ్ ఎంతో హెల్ప్ చేశారు - హీరోయిన్ సాక్షి వైద్య
వైవిధ్య‌మైన జోన‌ర్స్ క‌థాంశాల‌తో సినిమాలు చేయ‌టానికి ఎప్పుడూ ముందుండే హీరోల్లో మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ ఒక‌రు. తాజాగా ఈయ‌న క‌థానాయ‌కుడిగా న‌టించిన యాక్ష‌న్ అండ్ ఎమోష‌న‌ల్‌ థ్రిల్ల‌ర్ ‘గాండీవ‌ధారి అర్జున’. ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్‌గా నటించారు. స్టైలిష్ ఫిల్మ్ మేక‌ర్ ప్ర‌వీణ్ స‌త్తారు ఈ మూవీని తెర‌కెక్కించారు. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ మీద నిర్మించిన ఈ సినిమా ఆగ‌స్ట్ 25న గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా హీరోయిన్ సాక్షి వైద్య మీడియాతో ముచ్చటించారు. ఆమె చెప్పిన విశేషాలివే..


* 'ఏజెంట్' సినిమా రిలీజ్ కాకముందే కొన్ని షాట్స్‌ను ప్రవీణ్ సార్ చూశారు. ఈ సినిమాకు కొత్త హీరోయిన్ కావాలని అనుకున్నారు. ఐరా పాత్రకు నేను సెట్ అవుతానని అనుకున్నారు. అందుకే తీసుకున్నారు. మంత్రిగా నాజర్‌ గారి పాత్రకు ఎంతో ఇంపార్టెన్స్ ఉంటుంది. ఆయన పక్కనే కనిపించే నా పాత్ర చాలా బాగుంటుంది.


* ప్రవీణ్ గారు సన్నివేశాలను తెరకెక్కించే విధానం ఎంతో క్రియేటివ్‌గా ఉంటాయి. భిన్న రకాలుగా తీస్తుంటారు. ఆయన డైరెక్షన్ అద్భుతంగా ఉంది.


* వరుణ్ తేజ్ పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చాడు.. ఎలా ఉంటాడో అని నేను భయపడుతూ ఉండేదాన్ని. కానీ ఆయనే పిలిచేవారు.. మాట్లాడేవారు. ఆయన ఎంతో ఒదిగి ఉండేవారు.. నాకు ఈ ప్రయాణంలో ఆయన ఎంతో సాయం చేశారు. ఇప్పుడు తెలుగు కొంచెం కొంచెం అర్థం అవుతుంది.


* ఏజెంట్ బాగా ఆడకపోయినప్పుడు కాస్త బాధగా అనిపించింది. నాకు పర్సనల్‌గా ఎలాంటి ఫీలింగ్ అనిపించలేదు కానీ.. టీం ఎంతో కష్టపడి పని చేసింది.. అంత కష్టపడి పని చేసినా ఫెయిల్ అవ్వడం బాధగా అనిపించింది.


* ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ త్వరలోనే స్టార్ట్ అవుతుంది. నెక్ట్స్ సాయి ధరమ్ తేజ్ గారి సినిమాను చేస్తున్నాను. జూలై‌లో ఖాళీగా ఉండటంతో ప్రైవేట్ ఆల్బమ్ చేశాను. తెలుగులోనూ అలాంటి అవకాశం వస్తే ప్రైవేట్ ఆల్బమ్‌లో నటిస్తాను.


* ప్రవీణ్ గారు ఈ సినిమాను శరవేగంగా పూర్తి చేశారు. చకచకా షూటింగ్ పూర్తి చేయడంతో కనీసం వ్యానిటీకి వెళ్లి రెస్ట్ తీసుకునే టైం కూడా దొరకలేదు. అలా ఫాస్ట్‌గా షూట్ చేయడంతో ఎప్పుడూ ఆ పాత్రలోనే ఉండేదాన్ని. ఆ పాత్రలానే ప్రవర్తించేదాన్ని. లండన్‌లో షూటింగ్ చేయడం, మంచులో నటించడం కష్టంగా అనిపించదు. నాకు డ్రైవింగ్ అంతగా రాదు. ఆ సీన్లు చేసేటప్పుడు భయపడ్డాను.


* సమంత చేసిన యశోద లాంటి సినిమాలు వస్తే చేయాలని ఉంది. ప్రేమ కథా చిత్రాలు కూడా చేయాలని ఉంది. ఈ సినిమాకు నేనే డబ్బింగ్ చెప్పుకున్నాను.


* నిర్మాతలు బాపినీడుగారు, బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ గారు చాలా మంచి వారు. బాపి గారు ఎప్పుడూ సెట్స్ మీదకు వచ్చేవారు. అందరినీ పలకరించేవారు. అందరి బాగోగులు చూసుకునేవారు. అలాంటి నిర్మాతలు ఉండటం చాలా అరుదు.


* మిక్కీ జే మేయర్ గారి సంగీతం అద్భుతంగా ఉంటుంది. ఆయన హిందీలో చేసిన పాటలు నాకు చాలా ఇష్టం. ఈ సినిమాకు మంచి పాటలు ఇచ్చారు.


* తెలుగు ప్రేక్షకులు నన్ను చాలా ప్రేమిస్తున్నారు. తెలుగు భాషను నేర్చుకుని అభిమానుల ప్రేమను తిరిగి ఇస్తాను. నాకు తెలుగులో అల్లు అర్జున్ అంటే ఇష్టం. రామ్ చరణ్ గారు నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాను చూశాను. మా ట్రైలర్‌ను ఆయన రిలీజ్ చేస్తుండటం ఆనందంగా ఉంది. దుల్కర్ సల్మాన్‌తో లక్కీ భాస్కర్, సాయిధరమ్ తేజ్.. సినిమాల్లోనూ నటిస్తున్నాను. రవితేజ గారితోనూ నటించే అవకాశం ఉంది.Share this article :