77th Independence day Celebrations Held Grandly at FNCC

ఫిలింనగర్ కల్చరల్ సెంటర్లో ఘనంగా  స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు 




ఫిలింనగర్ కల్చరల్ సెంటర్లో 77వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. FNCC అధ్యక్షులు శ్రీ G. ఆదిశేషగిరిరావు గారు జెండాను ఎగురవేశారు.. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సందీప్ ప్రకాష్ iRS, చీఫ్ కమిషనర్, హీరో శ్రీకాంత్ పాల్గొన్నారు.  ఈ కార్య క్రమంలో మొదటగా FNCC అధ్యక్షులు శ్రీ G. ఆదిశేషగిరిరావు  గారు మాట్లాడుతూ అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేసి FNCC ఏ విధంగా అభివృద్ధి చెందిందో వివరిస్తూ ఫౌండర్ మెంబర్స్ ను స్మరించుకున్నారు. ముఖ్య అతిధి శ్రీ సందీప్ ప్రకాష్ గారు, ఫౌండర్ కమిటీ మెంబర్ సినీ నటుడు మాగంటి మురళీమోహన్ గారు, మాజీ కార్పొరేటర్ కాజా సూర్యనారాయణ, మాజీ అధ్యక్షుడు కె.ఎస్. రామారావు,  Dr కె.ఎల్. నారాయణ గారు, పరుచూరి గోపాల కృష్ణ గారు మాట్లాడారు. అనంతరం FNCC దత్తత తీసుకున్న గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ పిల్లలకు శ్రీ పీ సత్యానందం, సినీ రచయితా తండ్రి హనుమంతరావు  గారి జ్ఞాపకార్థం విద్యార్థులకు స్కాలర్ షిప్ అందచేశారు. ఆ తర్వాత FNCC స్టాఫ్ పిల్లలలో ఉన్న మెరిట్ విద్యార్థులకు FNCC మెంబర్లు జగదీష్, రామరాజు టాబ్ లను స్పాన్సర్ చేశారు. తదనంతరం FNCC ఫౌండర్ ప్రెసిడెంట్ లేట్ డీవీఎస్ రాజు గారి విగ్రహాన్ని పున ప్రతిష్ట చేశారు. ఈ కార్యక్రమంలో  డీవీఎస్ రాజు గారి కుటుంబ సభ్యులు, ప్రముఖులు2 పాల్గొని నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ ముళ్ళపూడి మోహన్, వైస్ ప్రెసిడెంట్ తుమ్మల రంగారావు,  జాయింట్ సెక్రటరీ వీవీఎస్ఎస్ పెద్దిరాజు, కమిటీ మెంబర్స్ గా కాజా సూర్యనారాయణ, బాలరాజు, గోపాలరావు, వడ్లపట్ల మోహన్, Ch. వరప్రసాదరావు, శైలజ జూజాల, కల్చరల్ కమిటీ చైర్మన్ తమ్మారెడ్డి భరద్వాజ, కల్చరల్ కమిటీ వైస్ చైర్మన్ సురేష్ కొండేటి తదితరులు  హాజరయ్యారు.

Post a Comment

Previous Post Next Post