చిరంజీవి బ్లడ్ బ్యాంకులో ఘనంగా 77వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు
77వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు సంప్రదాయ దుస్తులు ధరించి ఉదయాన్నే జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో జాతీయ జెండాను నిర్మాత అల్లు అరవింద్ ఆవిష్కరించి దేశంపై తనకున్న భక్తిని చాటుకున్నారు. జాతీయ జెండా ఆవిష్కరణ వేడుకల్లో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్‌తో పాటు మెగా ఫ్యాన్స్, రక్త దాతలు హాజరయ్యారు. అంతేకాక చిరంజీవి బ్లడ్ బ్యాంక్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మాధవి రాజు, చిరంజీవి బ్లడ్ బ్యాంక్ చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ ఈవీసీ శేఖర్ మరియు CCT -- COO
ఆర్. స్వామినాయుడు కూడా పాల్గొన్నారు.
అలాగే మెగాస్టార్ చిరంజీవి ఈరోజు ఉదయం తన ట్విట్టర్ ద్వారా దేశ ప్రజలందరకి, మెగా అభిమానులకు, ఆత్మీయులందరికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఈమేరకు సోషల్ మీడియాలో షేర్ చేశారు.
Post a Comment