Home » » Sravan Reddy Aiming For Good Position in TFI

Sravan Reddy Aiming For Good Position in TFI

 రచ్చ గెలిచి ఇంట కూడా గెలిచేందుకు

సన్నాహాలు చేసుకుంటున్న "శ్రవణ్ రెడ్డి"



క్రికెటర్ కావాలని కలలు కంటూ ఆ రంగంలో రాణిస్తున్న ఆ కుర్రాడు... కారణాంతరాల వల్ల ఆ క్రీడలో తన కల సాకారం అయ్యే అవకాశాలు లేకపోవడంతో... సినిమా రంగంపై దృష్టి సారించాడు. అయితే సినిమా రంగంలో రాజ్యమేలుతున్న వారసత్వాన్ని డీ కొట్టే సాహసం చేయడం ఇష్టం లేక... "చలో ముంబై" అంటూ ప్రతిభకు పట్టాభిషేకం చేస్తున్న అక్కడి టివి రంగంపై గురి పెట్టాడు. తన హైదరాబాద్ హిందీ భాషకు మరింతగా మెరుగులు దిద్దుకుని... తనను తాను సాన బెట్టుకున్నాడు. హిందీ టెలివిజన్ రంగంలో తన పేరు చిన్నగా మారు మ్రోగేలా చేసుకున్నాడు!!


హైదరాబాద్ లో పుట్టి పెరిగి... ముంబైలో తన ఉనికిని గట్టిగా నిరూపించుకుని... తెలుగు నిర్మాతల దృష్టిని విశేషంగా ఆకర్షిస్తున్న  ఆ తెలుగు కురరాడి పేరు "శ్రవణ్ రెడ్డి".!!


"దోస్తీ యారియా మన్మర్జియాన్", "థింకిస్తాన్ సీజన్ 1 అండ్ 2" వంటి వెబ్ సిరీస్ తో దేశవ్యాప్తంగా పేరు సంపాదించుకున్న శ్రవణ్ రెడ్డి ఇకపై తెలుగు సినిమాలపై ఎక్కువ దృష్టి సారిస్తానంటున్నాడు. ఎమ్.ఎస్.రాజు "డర్టీ హరి"తో "ఎవరీ శ్రవణ్ రెడ్డి?" అని ఆరాలు తీసే రేంజ్ లో పెర్ఫామ్ చేసిన ఈ స్పురధ్రూపి.... అజయ్ భూపతి దర్శకత్వంలో తాజాగా రూపొందుతున్న "మంగళవారం"తో తనేంటో మరోసారి నిరూపించుకునేందుకు తహతహలాడుతున్నాడు!!


హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ విద్యార్థి, "మిస్టర్ హైదరాబాద్" టైటిల్ విన్నర్ అయిన శ్రవణ్ రెడ్డి... పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో శిక్షణ తీసుకుని ఉండడం గమనార్హం. పలు యాడ్ ఫిల్మ్స్ లోనూ నటించి... జాతీయ స్థాయిలో గుర్తింపు కలిగి, తెలుగుతో పాటు... హిందీ, ఇంగ్లీష్ భాషల్లో మంచి పట్టు కలిగిన శ్రవణ్... పేరు పెట్టని మరో రెండు తెలుగు చిత్రాలకు సైన్ చేసి ఉండడం విశేషం. సినిమా మేకింగ్ కు సంబంధించిన మొత్తం ప్రాసెస్ తెలుసుకోవడం కోసం పలు హిందీ చిత్రాలకు దర్శకత్వ శాఖలోనూ పని చేసిన అనుభవం కలిగిన ఈ పక్కా "హైదరాబాద్ కుర్రాడు" ఇంట కూడా గెలవాలని కోరుకుందాం!!


Share this article :