Sony Charista Interview About Iddaru

 ప్రతి ఒక్కరు మెచ్చే "ఇద్దరు"


- చిత్ర కథానాయకి సోని చరిష్టా



      యాక్షన్ కింగ్ అర్జున్, రాధికా కుమారస్వామి (కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమాస్వామి అర్ధాంగి), సోని చరిష్టా హీరోహీరోయిన్లుగా నటించిన ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టైనర్ "ఇద్దరు". ఎఫ్.ఎస్.ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డి.ఎస్.రెడ్డి సమర్పణలో యువ ప్రతిభాశాలి ఎస్.ఎస్.సమీర్ దర్శకత్వంలో ఫర్హీన్ ఫాతిమా నిర్మించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈనెల 7న (జులై 7) ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ప్రముఖ నటుడు జె.డి.చక్రవర్తి, అమీర్ ఖాన్ సోదరుడు ఫైసల్ ఖాన్, స్వర్గీయ కె.విశ్వనాథ్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. 

      ఈ చిత్రం విడుదల సందర్భంగా హీరోయిన్లలో ఒకరైన సోని చరిష్టా మాట్లాడుతూ.... "ఈ చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన దర్శకుడు సమీర్ గారికి నా కృతజ్ఞతలు. యాక్షన్ కింగ్ అర్జున్ గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం నిజంగా నా అదృష్టం. "ఇద్దరు" అనే ఈ చిత్రం నా కెరీర్ లో ఓ మైలురాయి. చిత్ర సమర్పకులు డి.ఎస్.రెడ్డి, నిర్మాత "ఫర్హీన్ ఫాతిమా"లకు కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటన్నాను" అన్నారు!!

Post a Comment

Previous Post Next Post