Home » » Song Launched From Naresh Agastya film Asuragana Rudra

Song Launched From Naresh Agastya film Asuragana Rudra

 నరేష్‌ అగస్త్య , మురళీ కాట్రాగడ్డ, కమ్జుల ప్రొడక్షన్స్‌ 'అసురగణ రుద్ర' నుంచి నీ కనులలో పాట విడుదల



నరేష్‌ అగస్త్య, సంగీర్తన విపిన్‌, ఆర్యన్‌ రాజేష్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్న మెడిక‌ల్ క్రైం థ్రిల్లర్ ‘అసురగణ రుద్ర’. మురళీ కాట్రాగడ్డ దర్శకుడిగా పరిచయమౌతున్న ఈ చిత్రాన్ని కమ్జుల ప్రొడక్షన్స్‌ పతాకంపై మురళీ వంశీ నిర్మిస్తున్నారు.


తాజాగా ఈ చిత్రం నుంచి 'నీ కనులలో'  పాటని విడుదల చేశారు మేకర్స్. శేఖర్ చంద్ర ఈ పాటని మళ్ళీ మళ్ళీ వినాలనిపించే బ్యూటీఫుల్ మెలోడి కంపోజ్ చేశారు. సిద్దార్థ్ మీనన్ లైవ్లీ గా పాడిన ఈ పాటకు నికేష్ కుమార్ దాసగ్రంధి ఆకట్టుకునే సాహిత్యం అందించారు. ఈ పాటలో లీడ్ పెయిర్ మధ్య కెమిస్ట్రీ ని చాలా ప్లజంట్ గా ప్రజెంట్ చేశారు.


మురళీ శ‌ర్మ, ఆమ‌ని, శ‌త్రు, అమిత్‌, అభిన‌య‌, దేవీ ఫ్రసాద్ లాంటి ప్రముఖ తారాగణం ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. అమ‌ర‌నాథ్ బొమ్మిరెడ్డి కెమరామెన్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి  శ్రీ‌కాంత్ ప‌ట్నాయ‌క్‌ ఎడిటర్.


నటీనటులు: న‌రేష్ అగ‌స్త్య, సంగీర్తన విపిన్‌, ఆర్యన్ రాజేష్, మురళీ శ‌ర్మ, ఆమ‌ని, శ‌త్రు, అమిత్‌, అభిన‌య‌, దేవీ ఫ్రసాద్ త‌దిత‌రులు


సాంకేతిక విభాగం :

రచన, దర్శకత్వం: ముర‌ళీ కాట్రగ‌డ్డ

నిర్మాత: ముర‌ళీ వంశీ

బ్యానర్: కమ్జుల ప్రొడక్షన్స్‌

సంగీతం: శేఖ‌ర్ చంద్ర

డీవోపీ:  అమ‌ర‌నాథ్ బొమ్మిరెడ్డి

ఎడిట‌ర్: శ్రీ‌కాంత్ ప‌ట్నాయ‌క్‌

ఫైట్స్: న‌బా మాస్టర్‌

పీఆర్వో : వంశీ శేఖర్



Share this article :