Home » » Prestigious PATRIOTIC Bilingual film Bharateeyans" PRESS MEET

Prestigious PATRIOTIC Bilingual film Bharateeyans" PRESS MEET

 చైనా దురాగతాలను-దుష్ట పన్నాగాలను

బట్టబయలు చేసే "భారతీయన్స్"



రోజురోజుకు బలపడుతున్న మన మాతృభూమి భారత్ ని బలహీనం చేసేందుకు "డ్రేగన్ కంట్రీ" చైనా పన్నుతున్న దుష్ట పన్నాగాలను, ఈ క్రమంలో ఆ దేశం చేస్తున్న దురాగతాలను బట్టబయలు చేస్తూ రూపొందిన ద్విభాషా చిత్రం "భారతీయన్స్".  ప్రేమించుకుందాం రా, కలిసుందాం రా, ప్రేమంటే ఇదేరా" వంటి బ్లాక్ బస్టర్ లవ్ మూవీస్ కి కథలను అందించిన సంచలన రచయిత దీన్ రాజ్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ... భారత్ అమెరికన్ క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ ప్రవాస భారతీయుడు డాక్టర్ శంకర్ నాయుడు అడుసుమిల్లి నిర్మించిన ఈ చిత్రం ఈనెల 14న హిందీ, తెలుగు భాషల్లో విడుదల కానుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రసాద్ ల్యాబ్ ప్రివ్యూ థియేటర్లో జరిగిన పత్రికా సమావేశంలో నిర్మాత డాక్టర్ శంకర్ నాయుడు అడుసుమిల్లి, దర్శకుడు దీన్ రాజ్, చిత్ర కథానాయకుడు నీరోజ్ పుచ్చా, సంగీత దర్శకుడు సత్య కశ్యప్ పాల్గొన్నారు.


నిర్మాత శంకర్ నాయుడు మాట్లాడుతూ... గత 30 ఏళ్లుగా అమెరికాలో ఉంటూ... మన దేశం మీద ప్రేమ, అభిమానంతో నిర్మించిన ఈ దేశభక్తి చిత్రానికి సెన్సార్ పరంగా ఎదురైన ఇబ్బందులు కొంచెం బాద కలిగించినా... సినిమా చూసిన వారందరూ ముక్త కంఠంతో అభినందిచడం మా కష్టాలు మర్చిపోయేలా చేసింది" అన్నారు.

దర్శకుడు దీన్ రాజ్ మాట్లాడుతూ... దేశభక్తి ప్రధానంగా రూపొందిన ఈ చిత్రంలో అన్ని రకాల భావోద్వేగాలను మేళవించాం. అన్ని వర్గాల ప్రేక్షకులను కచ్చితంగా ఆకట్టుకుంటుంది" అన్నారు. "భారతీయన్స్" చిత్రంతో హీరోగా పరిచయం అయ్యే అవకాశం రావడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు నీరోజ్ పుచ్చా. ఈ చిత్రానికి సంగీతం అందించినందుకు గర్వంగా ఉందన్నారు సత్య కశ్యప్!!


Share this article :