Actor Suman Felicitated with Nata Kesari Award at Kodi Ramakrishna Jayanthi Celebrations

 కోలాహలంగా కోడి రామకృష్ణ జయంతి వేడుకలు

హీరో సుమన్ కు "నట కేసరి" బిరుదు ప్రదానం!!




శతాధిక చిత్ర దర్శకుడు కోడి రామకృష్ణ జయంతి వేడుకలు హైదరాబాద్, ప్రసాద్ ల్యాబ్ లో ఘనంగా జరిగాయి. వాసవి ఫిల్మ్ అవార్డ్స్ సారథ్యంలో నిర్వహించిన ఈ వేడుకలో సినిమా రంగంతోపాటు... ఉభయ రాష్ట్రాలలోని పలు రంగాల్లో సేవలు చేస్తున్న సామాజిక సేవాతత్పరులు, ప్రతిభావంతులకు ఘన పురస్కారాలు అందించారు. తెలుగు సినిమా రంగంలో సుష్టిర స్థానం సంపాదించుకున్న కోడి రామకృష్ణ పేరు ఉభయ రాష్ట్రాల్లో నిలిచేల చేయడం ఈ పురస్కారాల ముఖ్య ఉద్దేశ్యమని కార్యక్రమ సారథి - ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ పేర్కొన్నారు. ప్రముఖ నటుడు సుమన్ కి "నట కేసరి" బిరుదు ప్రదానం చేశారు. కోడి రామకృష్ణ కుమార్తె కోడి దివ్య, తెలంగాణ ఎఫ్.డి.సి.చైర్మన్ అనిల్ కూర్మాచలం, ప్రముఖ నటులు మురళి మోహన్, బాబు మోహన్, ప్రముఖ దర్శకులు రేలంగి నరసింహారావు ,సీనియర్ నటిమణులు రోజారమణి, కవిత, పెళ్ళిపుస్తకం దివ్యవాణి, వంశీ రామరాజు, ప్రముఖ వ్యాపారవేత్త బండారు సుబ్బారావు, మద్దుల ప్రకాష్, విజయలక్ష్మి, నంద కుమార్, రాయవరపు భాను ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. "విరూపాక్ష" దర్శకుడు కార్తీక్ వర్మ దండు, "సామజవరగమన" దర్శకుడు రామ్ అబ్బరాజు, కథా రచయిత భాను, "అనుకోని ప్రయాణం" దర్శకుడు వెంకట్ పెదిరెడ్ల, సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ ప్రభు తదితరులు పురస్కారాలు అందుకున్నారు. ఈ సందర్భంగా అతిథులు, పురస్కార గ్రహీతలు... కోడి రామకృష్ణ గొప్పతనాన్ని కొనియాడి, ఆయనకు ఘన నివాళులు అర్పించారు. కార్యక్రమ నిర్వాహాకులు తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, విబిజి రాజు, కొత్త వెంకటేశ్వరరావులకు అభినందనలు తెలియజేసారు!!

Post a Comment

Previous Post Next Post