Home » » Producer TG Vishwa Prasad Mother TG Geethanjali Garu Passed away

Producer TG Vishwa Prasad Mother TG Geethanjali Garu Passed away

నిర్మాత టి. జి. విశ్వ ప్రసాద్ కు మాతృ వియోగం



ప్రముఖ సినీ నిర్మాత, పీపుల్ మీడియా అధినేత టి. జి. విశ్వ ప్రసాద్ మాతృ మూర్తి శ్రీమతి టి జి గీతాంజలి (70) గారు ఈ రోజు సాయంత్రం 6.10 నిమిషాలకు శివైక్యం చెందారు. గత కొంత కాలంగా అస్వస్థతతో బెంగళూరు లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో గీతాంజలి గారు చికిత్స పొందుతున్నారు. కోలుకోలేని పరిస్థితుల కారణంగా ఆవిడ చివరి కోరిక మేరకు తనయుడు విశ్వప్రసాద్ వారాణాసి తీసుకువెళ్ళారు. అక్కడే దైవ దర్శనం అనంతరం, ఈరోజు ఆవిడ తుది శ్వాస విడిచారు.  గీతాంజలి గారికి భర్త, ముగ్గురు పిల్లలు ఉన్నారు. విశ్వప్రసాద్ గారు పెద్దకొడుకు. వారణాసిలో ఆవిడ అంత్యక్రియలు జరుగుతాయని విశ్వప్రసాద్ తెలిపారు. 


Share this article :