నిర్మాతగా నాకు భీమదేవరపల్లి బ్రాంచి సినిమా సంతృప్తిని ఇచ్చింది : నిర్మాత రాజా నరేందర్ చెట్లపల్లి
రాజా నరేందర్ చెట్లపల్లి నిర్మాతగా రమేష్ చెప్పాలా రచనా దర్శకత్వంలో జూన్ 23న విడుదల కాబోతున్న సినిమా భీమదేవరపల్లి బ్రాంచి. అంజి వల్గమాన్, సాయి ప్రసన్న,సుధాకర్ రెడ్డి (బలగం ఫేమ్),రాజవ్వ, కీర్తి లత, అభిరామ్, రూప శ్రీనివాస్, బుర్ర శ్రీనివాస్ (బీ.ఎస్),శుభోదయం సుబ్బారావు,గడ్డం నవీన్,వివ రెడ్డి, సి ఎస్ ఆర్,నర్సింహ రెడ్డి,పద్మ,మానుకోట ప్రసాద్,తాటి గీత, విద్యా సాగర్,మహి,వాలి సత్య ప్రకాష్, మిమిక్రీ మహేష్, తిరుపతి, బైరన్న
కటారి, రజిని, సుష్మా తదితరులు నటించిన ఈ సినిమా గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కింది. ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే కథ కథాంశంతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
అందమైన ఓ పల్లెటూరు కథ ఇది. అనుకోకుండా తమ ఖాతాలో పెద్ద మొత్తంలో డబ్బులు పడితే, ప్రభుత్వాలు ఇచ్చాయనుకుని, ఖర్చు చేసేస్తే, తలెత్తిన పర్యవసానాలు అన్నది భీమదేవరపల్లి బ్రాంచి అసలు పాయింట్ అని నిర్మాత రాజా నరేంద్ర చెట్లపల్లి తెలిపారు.
దర్శకుడు రమేష్ చెప్పాలా సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఒక ఆలోచనతో బయటికి వస్తారు. నిర్మాతగా నేను నా మొదటి సినిమా భీమదేవరపల్లి బ్రాంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం సంతోషంగా ఉందని నిర్మాత రాజా నరేంద్ర చెట్లపల్లి తెలిపారు.
కె.చిట్టి బాబు ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ అందించారు. చరణ్ అర్జున్ సంగీతం అందించిన ఈ సినిమాకు సుద్దాల అశోక్ తేజ సాహిత్యం అందించారు. బొంతల నాగేశ్వర్ రెడ్డి ఈ చిత్రానికి ఎడిటర్.